ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు.
గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్‌ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఫీచర్ వల్ల లాభం ఏంటంటే
నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్‌లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు.
2016 నుంచి విశ్వ ప్రయత్నాలు
గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్‌ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్‌తో దేశ భద్రతకు నష‍్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment