google street view
-
గూగుల్ స్ట్రీట్ వ్యూ 360
-
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు. గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్‌ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీచర్ వల్ల లాభం ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్‌లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు. 2016 నుంచి విశ్వ ప్రయత్నాలు గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్‌ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్‌తో దేశ భద్రతకు నష్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది. -
గూగుల్‌కు భారత్ ఝలక్
న్యూఢిల్లీ: గూగుల్ స్ట్రీట్ వీక్షణంలో భారత్‌లోని పలు ప్రదేశాలు చేర్చాలనే ఆలోచనలకు భారత ప్రభుత్వం బ్రేకులు వేసింది. గూగుల్‌కు అనుమతులు ఇస్తే రక్షణ పరమైన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఈ ప్రతిపాదనను హోం శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2008లో జరిగిన ముంబై దాడులు ఇలానే చోటుచేసుకున్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జియోస్పాటికల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్ 2016 అమలు అయితే ఇంటర్నెట్ సంబంధిత పలు సమస్యలకు చిక్కుముడులు విప్పొచ్చని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. గూగుల్ స్ట్రీట్ ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలు 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ఇది అమెరికా, కెనడా, యూరప్‌లలో వినియోగంలో ఉంది. -
రెండు తలల కుక్కను చూశారా?
'రెండు తలల పాము గురించి విన్నాం, వార్తల్లో చూశాంగానీ రెండు తలల కుక్కేమిటి?' అంటారా! రెండు తలల కుక్కేకాదు రెండు కాళ్ల పిల్లి, కాళ్లు లేని యువతి, తలలేని మనిషి, పిరమిడ్ లాంటి నిర్మాణం ముందు తెల్లదుస్తుల్లో నిల్చున్న దెయ్యం.. ఇలా చూడటానికి, చదువుకోడానికి ఎన్నో వింతలున్నాయి గూగుల్ లో. ఇదేదో నార్నియా తరహా ఫిక్షనో, మెజీషియన్ల కనికట్టోకాదు. పచ్చి నిజం. 360 డిగ్రీల సత్యం. గూగుల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్ట్రీట్ వ్యూలో ఇక్కడ చెప్పుకున్న వింతలన్నీ కనిపిస్తాయి. కెమెరాలోపమో, వేగంగా ఫొటోలు తీయడం వలనో తెలియదుగానీ సాధారణ రూపాలే ఇలా వింత ఆకారాలుగా కనిపించాయి. 2014లో స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి ఏఒక్కరూ పట్టించుకోని ఈ చిత్రాలను న్యూయార్క్ కు చెందిన కెయిల్ మ్యాథ్యూ విలియమ్స్ గుర్తించాడు. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన కెయిల్ బాడీ పెంయింటింగ్ లోనూ ఎక్స్ పర్ట్ అట. అందుకే స్ట్రీట్ వ్యూలో ఇలాంటి ఫొటోలను ఠక్కున గుర్తుపట్టి తన ట్టిట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆయన ఎలాంటి బొమ్మలు గీశాడో తెలియదుకానీ గూగుల్ తీసిన బొమ్మల్లో(ఫొటోల్లో)ని తప్పుల్ని కనిపెట్టి ఫేమస్ అయిపోయాడు కెయిల్! -
ఐటీపై హైదరాబాద్ మార్క్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ ఐటీ పటంపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 60 శాఖలు క లిగిన గూగుల్ సంస్థ... అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కేంద్ర కార్యాలయం తర్వాత (సొంత క్యాంపస్) అంత పెద్ద మరో క్యాంపస్‌ను నెలకొల్పేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం అరుదైన అంశమని ఐటీ నిపుణులు అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నందున త్వరలోనే క్యాంపస్ పనులు మొదలు కానున్నాయి. ఈ క్యాంపస్ ఏర్పాటు అనంతరం గూగుల్ ఉత్పత్తులకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వేదిక లుగా మారనున్నాయి. ప్రజలకు వైవిధ్యమైన సేవలు లభిస్తాయి. గూగుల్ రాకతో మిగతా దిగ్గజ కంపెనీలను కూడా హైదరాబాద్ ఆకర్షించే అవకాశముంది. గూగుల్ స్ట్రీట్ వ్యూతో.. ఆకాశం నుంచి పక్షులకు కనిపించే విధంగా హైదరాబాద్ నగరమంతటినీ అతి సమీపంగా, స్పష్టంగా 360 డిగ్రీల్లో కంప్యూటర్లో వీక్షించే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు చారిత్రక కట్టడాలైన తాజ్‌మహల్, కుతుబ్ మినార్లకు మాత్రమే గూగుల్ స్ట్రీట్వ్యూసదుపాయం ఉంది. హైదరాబాద్‌కు గూగుల్ స్ట్రీట్‌వ్యూ సదుపాయం అందుబాటులోకి వస్తే నావిగేషన్ ఎంతో సులువు అవుతుంది. ట్రాఫిక్ సమస్యల నుంచి నగర వాసులకు కష్టాలు తప్పుతాయి. గూగుల్ స్ట్రీట్‌వ్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించనున్న ప్రభుత్వం.. ఆ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసి ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు గూగుల్ సంస్థ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండడంతో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ, మొబైల్ సేవలు చవకగా లభ్యం కానున్నాయి. డిజిటల్ లిటరసీ పెరగడం ద్వారా ప్రతి ఒక్కరికీ విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించిన సేవలు అతి తక్కువ ధరకు దొరికే అవకాశముంది. గూగుల్ క్యాంపస్.. విశేషాలివీ * హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గూగుల్ ప్రాంగణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7.20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. * ఇక్కడ గూగుల్ మూడేళ్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అతిపెద్ద ప్రాంగణాన్ని నిర్మించనుంది. * సుమారు 13 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అధునాతన వసతులతో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. * నాస్కామ్ నివేదిక ప్రకారం... ఒక ఐటీ కంపెనీ రూపాయి పెట్టుబడి పెడితే, దాని ద్వారా పలు రకాలుగా ప్రభుత్వానికి రెండు రూపాయల రెవెన్యూ లభిస్తుంది. ఈ లెక్కన గూగుల్ రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. రెండు వేల కోట్లు రెవెన్యూ రానుంది. * ప్రత్యక్షంగా ఒక ఐటీ ఉద్యోగం కల్పనతో పరోక్షంగా ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, క్యాంటీన్ అవసరాలకే సుమారు 40 వేల మంది అవసరమవుతారని అంచనా. * ఒక పెద్ద ఐటీ కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికంగా రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర రంగాల్లోనూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. * భారీ వరదల కారణంగా చెన్నై ఐటీ పరిశ్రమ ఛిన్నాభిన్నం కావడంతో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌పై దృష్టిపెట్టాయి. * ప్రముఖ కంపెనీల కేంద్ర కార్యాలయాలు (సొంత ప్రాంగణాలు) హైదరాబాద్‌కు రావడం ద్వారా రాష్ట్రంలోని ఇతర (టైర్ టూ) నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. పపంచ ఐటీ రాజధానిగా.. హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయం. చెన్నైలో భారీ వరదల కారణంగా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ సమయంలో ైెహ దరాబాద్‌కు ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాయితీలు, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. - సందీప్‌కుమార్ మక్తాల, రాష్ట్ర ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు హైదరాబాద్ గ్లామర్ ఇదీ.. మే నెలలో అమెరికా పర్యటన సందర్భంగా మాతో గూగుల్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి కట్టుబడి అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతమున్న 6,400 మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేస్తామని గూగుల్ చెప్పింది. హైదరాబాద్ గ్లామర్ ఏమిటో, పొటెన్షియాలిటీ ఏమిటో ప్రపంచానికి అర్థమవుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, అమెజాన్, నోవార్టిస్ తదితర మల్టీ నేషనల్ కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించే విధంగా మంచి పాలసీలను తెస్తాం. త్వరలోనే నాలుగు ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. - కె.తారక రామారావు, ఐటీశాఖ మంత్రి -
‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’లో భారత అందాలు!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో మనదేశంలోని అన్ని నగరాలు, పర్యాటక ప్రాంతాలు, పర్వతాలు, నదుల అందాలను 360 డిగ్రీల కోణంలో, 3డీలో అత్యంత స్పష్టంగా, కళ్లకు కట్టేలా వీక్షించే సదుపాయం త్వరలో లభించనుంది. రక్షణ రంగ నిర్మాణాలు, అణు కార్యక్రమ ప్రదేశాలు, కొన్ని ఇతర అత్యంత సున్నిత ప్రాంతాలను మినహాయించి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలను ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్‌కు అనుమతినివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పీఎంఓ శాఖల ఉన్నతాధికారులు దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారని, గూగుల్‌కు లాంఛనంగా ఈ సమాచారాన్ని త్వరలో అందించనున్నారని మంగళవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాల సజీవ దృశ్యాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, కెనడా, పలు యూరోప్ దేశాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ పరిమిత స్థాయిలో ఇది అందుబాటులో ఉంది. తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్‌మినార్, వారణాసి నదీ తీరం, నలంద యూనివర్సిటీ, మైసూర్ రాజమందిరం, తంజావూరు దేవాలయం, చిన్నస్వామి స్టేడియంతో పాటు కొన్ని ఇతర పర్యాటక ప్రాంతాలను భారత పురావస్తు పరిశోధక శాఖ భాగస్వామ్యంతో గూగుల్ తన ‘స్ట్రీట్ వ్యూ’లో పొందుపర్చింది. స్ట్రీట్ వ్యూ సదుపాయం ఉన్న ప్రాంతాలను ‘గూగుల్ మ్యాప్స్’లోని నీలిరంగు రేఖల ద్వారా గుర్తించవచ్చు. -
హైదరాబాద్‌కు త్వరలోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ
హైదరాబాద్ నగరానికి త్వరలోనే మరో కొత్త ఖ్యాతి లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరానికి 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' రానుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాణిక్ గుప్తా, గ్రౌండ్ ట్రూత్ ఇంజనీరింగ్ లీడ్ తుమ్మల నారాయణ తదితరులను కేటీఆర్ బృందం కలుసుకుంది. అమెరికా, కెనడా సహా అనేక యూరోపియన్ దేశాల్లో స్ట్రీట్ వ్యూను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే భారతదేశంలో మాత్రం అది ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. గూగుల్ మ్యాప్స్‌ను బట్టి కొంతవరకు మార్గాలు తెలుసుకోగలిగినా కచ్చితంగా ఏ వీధిలో ఎక్కడ ఏ ఇల్లుందో, ఏ షాపుందో అనే వివరాలు మాత్రం ఇంకా రావట్లేదు. దేశంలోనే తొలిసారిగా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించిన 'స్ట్రీట్ వ్యూ' అందుబాటులోకి రాబోతోంది. దాంతో జంట నగరాల్లో ఏ గల్లీలో ఏముందోనన్న విషయం కూడా మనకు అరచేతిలో స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఇందుకోసం తగిన అనుమతులు తీసుకోడానికి కేంద్ర హోం మంత్రితో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే అనుమతులు రావొచ్చని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలను కూడా దీని పరిధిలోకి తెస్తామన్నారు. భవన నిర్మాణ ప్లాన్ల అతిక్రమణలు, ఆస్తిపన్ను వసూళ్లు, పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ లాంటి అవసరాలకు కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ నుంచి తగిన సపోర్ట్ అందించేందుకు గూగుల్ అంగీకరించింది. గతంలో కూడా స్ట్రీట్ వ్యూ భారతదేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరిగినా.. అప్పుడు కొన్ని నియంత్రణలు అడ్డంగా నిలిచాయి.