గూగుల్ మ్యాప్ ఫొటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్‌లో జరిగింది. సోరియా ప్రావిన్స్‌లోని తజుకో పట్టణ వీధులను గత ఏడాది నుంచి గూగుల్ యాప్ చిత్రించడం మొదలు పెట్టింది. అందులో కనిపించిన ఒక ఫొటో చివరికి హత్య కేసు తాలూకు దోషుల్ని పట్టించింది.
క్యూబాకు చెందిన జార్జి అనే 33 ఏళ్ల వ్యక్తి 2023 అక్టోబర్‌లో అదృశ్యమయ్యాడు. తానో మహిళను కలిశానని, స్పెయిన్ నుంచి వెళ్లిపోతున్నానని చివరిసారిగా బంధువుకు జార్జి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత అతడు కనబడకుండా పోవడంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒక వ్యక్తి తన కారు డిక్కీలోకి పెద్ద ప్లాస్టిక్ సంచిని లోడ్ చేస్తున్న చిత్రం ఇటీవల గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోలీసుల కంట పడింది. అనుమానం వచ్చి విచారించగా ఓ మహిళ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జార్జిని హత్య చేసినట్లు తేలింది. దాంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
చదవండి: వింత ఆచారం.. నేలపై పాకుతూ వెళుతూ..
Comments
Please login to add a commentAdd a comment