
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా యూకేలో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. యూకేలోని అత్యున్నత అకాడమీ, రీసెర్చ్ సంస్థతో సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పేర్కొంది. మిల్టన్ కీన్స్‌లో కంపెనీకిగల మేకర్స్ ల్యాబ్‌లో కోఇన్నోవేట్ ఒప్పందాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 1,000 మందివరకూ ఉపాధి కల్పించే వీలున్నట్లు తెలియజేసింది. కాగా.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విషయంలో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకునేందుకు వీలైన కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment