
టెక్ మహీంద్రా నికరలాభాలు జూమ్
ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్ర లాభాల్లో దూసుకుపోయింది. 20.5 శాతం నికర లాభాలను ఆర్జించినట్టు సోమవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో పేర్కొంది.
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్ర లాభాల్లో దూసుకుపోయింది. 20.5 శాతం నికర లాభాలను ఆర్జించినట్టు సోమవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో పేర్కొంది. జూన్ 30, 2016 తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 20.5 శాతం వృద్ధితో రూ. 750 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ 622.5 కోట్లుగా ఉంది. నికర ఆదాయంలో 10శాతం వృద్ధితో రూ. 6,921 కోట్లుగా రిపోర్టు చేసింది. ఆపరేటింగ్ లాభం 13.7 శాతంతో రూ 1,029 కోట్ల వద్ద ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో సంస్థ ఆదాయం రూ 6.921 కోట్లుగా ఉంది.
తమ వ్యాపార వృద్ధి బలహీనత ఉన్నప్పటికీ ఈ క్వార్టర్ నిలకడైన వృద్ధిని సాధించామని వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు.
వినియోగదారుల వృద్ధి, డిజిటల్ విజయాలు, బలమైన నగదు లావాదేవీల తదితర పారామీటర్ల కారణంగా ఆదాయంలో వృద్ధి సాధించిందనీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో సీపీ గుర్నాని చెప్పారు. ఐటి సొల్యూషన్ ప్రొవైడర్ టెక్ మహీంద్ర ఆటోమేషన్, డెలివరీ సమర్థత రెండు రంగాలపై తమ ఫోకస్ ఉంటుందని పేర్కొన్నారు.