![Tech Mahindra FY24 Q2 net declines more than 60percent - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/26/TECH-MAHINDRA.jpg.webp?itok=uEOhbyOD)
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం 61 శాతం క్షీణించి రూ. 505 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,299 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 12,864 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 13,130 కోట్ల టర్నోవర్ సాధించింది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన తన కెరీర్‌లోకెల్లా గత కొన్ని త్రైమాసికాలు అత్యంత క్లిష్టమైనవంటూ టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు.
► త్రైమాసికవారీగా 78% వృద్ధితో రూ. 5,300 కోట్లు(64 కోట్ల డాలర్లు) విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 2,980 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది.
► మొత్తం సిబ్బంది సంఖ్య 8 శాతంపైగా క్షీణించి 1,50,604కు పరిమితమైంది. గతేడాది క్యూ2 లో ఈ సంఖ్య 1,63,912గా నమోదైంది.
► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 11%కి దిగివచి్చంది.
ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1.4% నష్టంతో రూ. 1,140 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment