
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్‌బెంచ్‌ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్‌బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్‌ఫ్లోను సరళతరమైన ఇంటర్‌ఫేస్‌తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది.