అంచనాలు మిస్ చేసిన టెక్ మహీంద్రా
అంచనాలు మిస్ చేసిన టెక్ మహీంద్రా
Published Fri, May 26 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
దేశంలో నాలుగో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా అంచనాలను మిస్ చేసింది. అంచనావేసిన దానికంటే తక్కువ లాభాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడించిన మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో ఈ కంపెనీ నికర లాభాలు 30.2 శాతం పడిపోయి, రూ.589.6 కోట్లగా నమోదయ్యాయి. ముందటేడాది ఇదే క్వార్టర్ లో కంపెనీకి రూ.876 కోట్ల లాభాలున్నాయి. ఈ మార్చి క్వార్టర్ లో టెక్ మహింద్రా రూ.783 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను ఆర్జిస్తుందని థామ్సన్ రాయిటర్స్ సర్వేలో విశ్లేషకులు అంచనావేశారు. ఈ క్వార్టర్ లో రెవెన్యూలు స్వల్పంగా 0.8 శాతం పడిపోయి రూ.7,495కోట్లగా ఉన్నాయి. కానీ ఏడాది ఏడాదికి బేసిస్ లో ఇవి రూ.8.9 శాతం పెరిగాయి.
ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్ లో ఏడాది ఏడాదికి 21.9 శాతం తగ్గి రూ.899కోట్లగా నమోదయ్యాయి. మార్జిన్లు 12 శాతం పైకి ఎగిశాయి. క్వార్టర్ ఫలితాలతో పాటు టెక్ మహీంద్రా 2017 వార్షిక ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ నికర లాభాలు 6 శాతం పడిపోయి, రూ.2813 కోట్లగా రికార్డైనట్టు పేర్కొంది. రెవెన్యూలు 10 శాతం పెరిగి రూ.29,141 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఈబీఐటీడీఏలు వార్షికంగా 2శాతం డౌనయ్యాయి.
ఈ ఫలితాల ప్రకటన సందర్భంగానే ఒక్కో షేరుకు 9 రూపాయలు డివిడెంట్ ను బోర్డు ఆమోదించినట్టు తెలిపింది. క్లయింట్స్ వద్ద నుంచి మారుతున్న డిమాండ్లు, టెక్నాలజీ మార్పులు, అవసరమైన నైపుణ్యాలను ప్రస్తుతం ఇండస్ట్రి ఎదుర్కొంటుందని టెక్ మహీంద్రా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నాని తెలిపారు. అవసరమైన మేరకు తమ వర్క్ ఫోర్స్ కు రీస్కిలింగ్, రీట్రైనింగ్ చేపడతామని తెలిపారు. వినూత్నావిష్కరణలను ప్రోత్సహిస్తామన్నారు.
Advertisement
Advertisement