ఫ్యూచర్ టెక్నాలజీగా అందరిచేత అభివర్ణించబడుతున్న మెటావర్స్‌పై ఫోకస్ చేసింది టెక్ మహీంద్రా. మిగిలిన కంపెనీల కంటే ముందుగానే మెటావర్స్‌పై పట్టు సాధించేందుకు ప్రత్యేక యాక‌్షన్ ప్లాన్ రెడీ చేసింది. హైదరాబాద్ వేదికగా ప్లాన్ అమలు కానుంది.
మెటావర్స్ రంగంలో పని చేసేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది ఇంజనీర్లను ఎంపిక చేసింది టెక్ మహీంద్రా. ఈ గ్రూప్‌కి టెక్‌ఎంవర్స్‌గా పేరు పెట్టింది. ఈ గ్రూపుకి చెందిన ఇంజనీర్లు మెటావర్స్ ఆధారిత సేవలపై పని చేస్తారు. హైదరాబాద్, పూనే, డల్లాస్, లండన్ వేదికగా నాలుగు టీమ్‌లను టెక్‌ఎంవర్స్ కోసం ఏర్పాటు చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్‌చెయిన్, 5జీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర టెక్నాలజీతో మెటావర్స్ సమ్మిళతం చేస్తూ సరికొత్త బిజినెస్ మోడళ్లను రూపొందించడం టెక్‌ఎంవర్స్‌లు ప్రధాన బాధ్యతలు. సంక్లిష్టమైన ఈ పనిని సుళువుగా చేసి భవిష్యత్తుకు అనుగుణంగా బిజినెస్‌ను విస్తరించేందుకే ఈ వెయ్యిమందితో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసింది టెక్ మహీంద్రా.
ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్ ప్లేస్, మెటా బ్యాంక్ (వర్చువల్ బ్యాంక్), గేమింగ్ సెంటర్, మెటావర్స్ బేస్డ్ కార్ డీలర్‌షిప్, మిడిల్‌మిస్ట్ తదితర అనేక ఆవిష్కరణలకు మెటావర్స్‌లో చోటుంది. మెటావర్స్‌తో మన రియాల్టీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకు అనుగుణంగా మా ప్రణాళికలు ఉంటాయని టెక్ మహీంద్రా ప్రతినిధుతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment