ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అనంతరంఆరంభంలో భారీ సెల్లింగ్ ప్రెసర్ తో దాదాపు 150పాయింట్లకు పైగా మార్కెట్ పతనమైనంది. కానీ వెనువెంటనే కోలుకుని లాభాల బాటపట్టాయి. తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఒక దశలో దాదాపు సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 63 పాయింట్లు ఎగిసి 31,090 వద్ద నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 9603వద్ద కొనసాగుతున్నాయి. అయితే బెంచ్ మార్క్‌లు రెండూ సాంకేతిక స్థాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. .మెటల్, ఎఫ్ఎంసిజి, చమురు, గ్యాస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా ఐటీ ఫార్మా భారీ పతనాన్ని నమోదు చేశాయి. సన్ ఫార్మా, టెక్ మహీంద్రా టాప్ లూజర్‌గా ఉన్నాయి. మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రభావం చూపిస్తున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, లూపిన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఒఎన్జిసి, విప్రో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ కూడా నష్టపోయాయి. మరోవైపు హెచ్డిఎఫ్సి, హిందాల్కో, ఇండియాబూల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వేదాంత, బిపిసిఎల్ లాభపడ్డాయి.
అటు డాలర్ మారకరంలో రూపాయి13 పైసలు క్షీణించి రూ.64.57వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌మార్కెట్ లో భారీగా లాభపడింది. రూ.229 లుఎగిసి రూ. 28,890 వద్ద వుంది.