ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు
Published Mon, Jun 5 2017 9:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
ముంబై : బంగారం వంటి మరికొన్ని వస్తువులు, సేవలపై పన్ను శ్లాబులు ఎలా ఉండబోతున్నాయనే సస్పెన్షన్ కు జీఎస్టీ కౌన్సిల్ తెరదించిన అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 17.94 పాయింట్ల నష్టంలో 31,225 వద్ద, నిఫ్టీ 5.10 పాయింట్ల లాభంలో 9658గా ట్రేడవుతోంది. ప్రారంభంలో సన్ ఫార్మా, సిప్లా, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్ కార్ప్, భారతీ ఇన్ ఫ్రాటెల్, ఐఓసీ, ఇండియాబుల్స్ హౌజింగ్, అరబిందో ఫార్మా లాభాలు పండించాయి.
అదేవిధంగా ఐటీసీ, లుపిన్, కోల్ ఇండియా, విప్రో, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.32 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కట్లో బంగారం ధరలు 253 రూపాయలు పైకి జంప్ చేశాయి. ప్రస్తుతం 28,905 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement
Advertisement