బెంగళూరు: తయారీ రంగానికి తోడ్పడే భవిష్యత్ టెక్నాలజీల రూపకల్పనకు ఉపయోగపడేలా టెక్ మహీంద్రా.. బెంగళూరులోని తమ క్యాం పస్‌లో అధునాతన ‘లాబొరెటరీని ‘ఫ్యాక్టరీ ఆఫ్ ది ఫ్యూచర్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లో డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్.. ఆటోమేషన్ తదితర టెక్నాలజీలపై పరశోధనలు జరుగుతాయి. రోబోలు, మనుషులు కలిసి పనిచేసే విధానాలు ఇప్పుడిప్పుడే పరిశ్రమకు పరిచయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవి తయారీ రంగంలో మరింత కీలక పాత్ర పోషించనున్నాయని టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ ఎల్ రవిచంద్రన్ చెప్పారు. అంతర్జాతీయంగా ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని, తయారీ రంగానికి టెక్నాలజీ వెన్నెముకగా నిలవనుందని ఆయన వివరించారు.