నాస్కామ్ చైర్మన్‌గా బీవీఆర్ మోహన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి 2015-16 సంవత్సరానికి గాను సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా బుధవారం ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఆర్.చంద్రశేఖరన్ ఉన్నారు. ఏప్రిల్ 9న మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా.. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కేవలం పెద్ద సంస్థలే కాకుండా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ), స్టార్టప్స్‌కి ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని మోహన్‌రెడ్డి తెలిపారు. 100 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది.