సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందించేందుకు టెక్ మహీంద్రా సంస్థ ముందుకు వచ్చింది.
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందించేందుకు టెక్ మహీంద్రా సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు చెందిన స్మార్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ నిర్వాహకులు మెట్టుగూడ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాలులో అప్సా సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.
పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18- 27 ఏళ్ల యువతీయువకులు ఇందుకు అర్హులు. స్పోకెన్ ఇంగ్లిష్‌తోపాటు, ఇంగ్లిష్ టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ తదితర కోర్సుల్లో 3 నెలల పాటు ఇక్కడ శిక్షణ ఇస్తోంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతోపాటు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
త్వరలో కొత్తగా ప్రారంభించనున్న శిక్షణ గ్రూపుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 23వ తేదీలోపు చిరునామా, విద్యార్హతకు సంబంధించిన ధృవీకరణలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మెట్టుగూడ అయ్యప్ప దేవాలయం సమీపంలోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాలులో నేరుగా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 90637 80995, 90637 80994 సెల్ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.