
అమెరికాకు చెందిన గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్, అల్లీస్ గ్రూప్ ఇండియా సంస్థలను భారత ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా పూర్తిగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తివాటాలు టెక్ మహీంద్రా సొంతం..!
అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పూర్తిగా 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ మొత్తం విలువ 125 మిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని కంపెనీ పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనుంది.
అమెరికాలోని సీటెల్ వేదికగా అల్లీస్ ఇండియా, గ్రీన్ ఇన్వెస్టమెంట్స్ పనిచేస్తున్నాయి. సుమారు 660 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థల కొనుగోలుతో టెఖ మహీంద్రాకు డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సోల్యుషన్స్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, క్లౌడ్ అండ్ ఆటోమేషన్, బీఐ అండ్ అనలిటిక్స్, టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో కంపెనీ మరింత వృద్ధిని నమోదుచేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..! వాటిని వదిలించుకునేందుకే..
Comments
Please login to add a commentAdd a comment