
ఈడీ కేసులో టెక్ మహీంద్రాకు ఊరట
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసుకు సంబంధించి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు ఊరట లభించింది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసుకు సంబంధించి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు ఊరట లభించింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వ్యవహారంలో టెక్ మహీంద్రా మీద అభియోగాలు మోపే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం నాలుగు నెలల్లోగా తేల్చాలని, అప్పటిదాకా కంపెనీపై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయరాదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మోసపూరితంగా సత్యం కంప్యూటర్స్‌లోకి వచ్చాయన్న ఆరోపణలపై ఈడీ రూ. 822 కోట్లు అటాచ్ చేయడం, కంపెనీపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారి తీసింది.
దీనిపైనే కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదాలను ప్రస్తుత యాజమాన్యానికి ఆపాదించరాదని ఈ సందర్భంగా టెక్ మహీంద్రా తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.