ఉద్యోగులకు సారీ: టెక్‌ మహీంద్రా | Anand Mahindra & Tech Mahindra CEO CP Gurnani apologise over manner of employee's sacking | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు సారీ: టెక్‌ మహీంద్రా

Published Fri, Jul 7 2017 9:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

ఉద్యోగులకు సారీ: టెక్‌ మహీంద్రా

ఉద్యోగులకు సారీ: టెక్‌ మహీంద్రా

బెంగుళూరు: మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానిలు ట్వీటర్‌ వేదికగా ఉద్యోగులకు క్షమాపణలు తెలిపారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఓ ఉద్యోగిని కంపెనీ నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇందుకు సంబంధించి సదరు ఉద్యోగి కంపెనీ హెచ్‌ఆర్‌ వారితో జరిపిన సంభాషణలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏకంగా కంపెనీ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. సదరు ఉద్యోగికి క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగిని ఇలాంటి ఇబ్బందికి గురి కానివ్వమని హామీ ఇచ్చారు.

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేసిన కొద్ది సేపటి తర్వాత స్పందించిన సీఈవో సీపీ గుర్నాని.. ఉద్యోగితో హెచ్‌ఆర్‌ ప్రవర్తించిన తీరుకు తాను చాలా బాధపడుతున్నట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్ధితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement