gurnani
-
సీఎం జగన్ ను కలిసిన టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో గుర్నాని
-
రాష్ట్రంలో టెక్ మహీంద్రా స్టార్ హోటల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీసీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్‌కు ఆయన వివరించారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు వెల్లడించారు. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ.. ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. , , -
ఆనంద్ మహీంద్రా, గుర్నానీ క్షమాపణలు
టెక్ మహీంద్రాలో ఉద్యోగి తొలగింపు ఘటనపై స్పందన న్యూఢిల్లీ: ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థ వ్యవస్థాపకులు ఉద్యోగికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేయడం చాలా చాలా అరుదు. ఇలాంటి ఘటనే ఒకటి టెక్ మహీంద్రా కంపెనీలో చోటుచేసుకుంది. సాక్షాత్తు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఉద్యోగికి ట్వీటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశారు. ఈయనతోపాటు సంస్థ సీఈవో కూడా ఉద్యోగికి క్షమాపణలు చెప్పారు. వీరు ఎందుకు క్షమాపణలు తెలిపారో చూద్దాం.. టెక్ మహీంద్రాలోని హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అదే కంపెనీలోని ఉద్యోగిని రాజీనామా చేయాలని కోరారు. కంపెనీ నిర్ణయం మేరకు రేపు ఉదయానికంతా రిజైన్ పేపర్లు టేబుల్ మీద ఉండాలని ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా.. ‘నేను వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియజేస్తున్నా. వ్యక్తి గౌరవాన్ని కాపాడటమనేది సంస్థ విలువల్లో ప్రధానమైనది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం’ అని ట్వీట్ చేశారు. ‘ఉద్యోగి, హెచ్ఆర్ ప్రతినిధి మధ్య జరిగిన సంభాషణ తమ దృష్టికి వచ్చింది. దీనిపై చింతిస్తున్నా. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం’ అని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ ట్వీట్ చేశారు. టెక్ మహీంద్రా సీఈవో భారీ ప్యాకేజీ ♦ 2016–17లో గుర్నానీకి రూ. 150 కోట్లు ♦ 3 ఐటీ దిగ్గజాల చీఫ్‌ల మొత్తం రెమ్యూనరేషన్ కన్నా అధికం న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ గత ఆర్థిక సంవత్సరం జీతభత్యాల కింద ఏకంగా రూ. 150.7 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. దేశీయంగా మూడు దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల చీఫ్‌లు మొత్తం కలిపి అందుకున్న దానికన్నా ఇది అధికం కావడం గమనార్హం. అయితే, ఈ ప్యాకేజీలో ఆయన జీతం, కంపెనీ తన వంతుగా కట్టిన పీఎఫ్ అంతా కలిపి రూ. 2.56 కోట్లే. మిగతాదంతా కూడా కంపెనీ గతంలో కేటాయించిన స్టాక్ ఆప్షన్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చింది. ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్‌గా ఉన్న ఎన్.చంద్రశేఖరన్ గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సీఈవోగా ఉన్నప్పుడు రూ. 30.15 కోట్లు అందుకోగా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా రూ. 45.11 కోట్లు దక్కించుకున్నారు. గత మూడేళ్లుగా టాప్ ఎగ్జిక్యూటివ్స్‌కు భారీ వేతనాలు ఇస్తున్న టెక్ మహీంద్రా.. ఐటీ రంగానికి సవాళ్ల నేపథ్యంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న వారి జీతాల పెంపు మాత్రం మేనేజ్మెంట్ సమీక్ష తర్వాతే ఉంటుందని ఫిబ్రవరిలో ప్రకటించడం గమనార్హం. -
ఉద్యోగులకు సారీ: టెక్ మహీంద్రా
బెంగుళూరు: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానిలు ట్వీటర్ వేదికగా ఉద్యోగులకు క్షమాపణలు తెలిపారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఓ ఉద్యోగిని కంపెనీ నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇందుకు సంబంధించి సదరు ఉద్యోగి కంపెనీ హెచ్ఆర్ వారితో జరిపిన సంభాషణలు ఆన్లైన్లో లీకయ్యాయి. తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏకంగా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సదరు ఉద్యోగికి క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగిని ఇలాంటి ఇబ్బందికి గురి కానివ్వమని హామీ ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన కొద్ది సేపటి తర్వాత స్పందించిన సీఈవో సీపీ గుర్నాని.. ఉద్యోగితో హెచ్ఆర్ ప్రవర్తించిన తీరుకు తాను చాలా బాధపడుతున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్ధితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. I want to add my personal apology. Our core value is to preserve the dignity of the individual & we'll ensure this does not happen in future https://t.co/yBxAxvFZlc — anand mahindra (@anandmahindra) 7 July 2017 I deeply regret the way the HR rep & employee discussion was done. We have taken the right steps to ensure it doesn’t repeat in the future. pic.twitter.com/KKLt6tIBb6 — CP Gurnani (@C_P_Gurnani) 7 July 2017 -
నాస్కామ్ చైర్మన్ గా గుర్నానీ..
♦ వైస్ చైర్మన్‌గా రమణ్ రాయ్ ♦ ఈసారి ఐటీలో 14% వృద్ధి అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ, వైస్ చైర్మన్‌గా బీపీవో గురు.. క్వాత్రో గ్లోబల్ సర్వీసెస్ సీఎండీ రమణ్ రాయ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో గుర్నానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయన్నారు. ‘‘ఈ సారి ఐటీ రంగ వృద్ధి 12-14 శాతం మేర ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2.5 లక్షల పైచిలుకు నియామకాలు ఉండే అవకాశముంది’’ అన్నారాయన. 2018 మార్చిలో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఐటీతో కలసి నాస్కామ్ హైదరాబాద్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ప్రోడక్టు కంపె నీలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు నాస్కామ్ ప్రతినిధిగా మారగలదని మోహన్ రెడ్డి చెప్పారు. 2020 నాటికి ఐటీ రంగం ఆదాయాలు 250 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయన్నారు. ఇంకా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో టెక్నాలజీ హబ్‌లు ఏర్పాటు చేశాం. మరిన్ని చోట్ల నెలకొల్పేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం నివేదికను రూపొందించిందని, త్వరలోనే దీన్ని ప్రభుత్వానికిస్తామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.