టెక్‌ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ | Tech Mahindra to buy US healthcare provider valued at $110 million | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ

Published Tue, Mar 7 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

టెక్‌ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ

టెక్‌ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ

డీల్‌ విలువ 8.95 కోట్ల డాలర్లు
ముంబై: ఐటీ దిగ్గజం టెక్‌  మహీంద్రా అమెరికాకు చెందిన ఐటీ సర్వీసుల కంపెనీని కొనుగోలు చేయనున్నది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ ఐటీ, కన్సల్టింగ్‌ కంపెనీ సీజేఎస్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ ఎల్‌ఎల్‌సీని కొనుగోలు చేయనున్నామని టెక్‌  మహీంద్రా తెలిపింది. హెచ్‌సీఐ గ్రూప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీలో 84.7% వాటాను 8.95 కోట్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. మిగతా 15.3% వాటాను మూడేళ్లలో కొనుగోలు చేస్తామన్నారు. ఆరో గ్య సంరక్షణ రంగంలో ఐటీ సేవలను మరింత విస్తరించడానికి, హెల్త్‌కేర్‌ కన్సల్టెంట్‌లకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జాక్సన్‌విల్లె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఐ గ్రూప్‌...ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్, ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డ్‌ సాఫ్ట్‌వేర్, శిక్షణ, సపోర్ట్‌ సర్వీసులను అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement