IT service
-
బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదు.. బీసీజీ నివేదిక
గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్‌లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్‌కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత2022, 2023లో ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్లో కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది. -
టెక్ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ
డీల్ విలువ 8.95 కోట్ల డాలర్లు ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అమెరికాకు చెందిన ఐటీ సర్వీసుల కంపెనీని కొనుగోలు చేయనున్నది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీ సీజేఎస్ సొల్యూషన్స్ గ్రూప్ ఎల్ఎల్సీని కొనుగోలు చేయనున్నామని టెక్ మహీంద్రా తెలిపింది. హెచ్‌సీఐ గ్రూప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీలో 84.7% వాటాను 8.95 కోట్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. మిగతా 15.3% వాటాను మూడేళ్లలో కొనుగోలు చేస్తామన్నారు. ఆరో గ్య సంరక్షణ రంగంలో ఐటీ సేవలను మరింత విస్తరించడానికి, హెల్త్‌కేర్ కన్సల్టెంట్లకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జాక్సన్‌విల్లె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఐ గ్రూప్...ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సాఫ్ట్వేర్, శిక్షణ, సపోర్ట్ సర్వీసులను అందిస్తోంది. -
అంచనాలకు తగ్గట్లే విప్రో
క్యూ3లో నికర లాభం రూ.2,234 కోట్లు; 2% వృద్ధి ► ఆదాయం 12,310 కోట్లు. 9% అప్ ► రూ. 5 మధ్యంతర డివిడెండ్ బెంగళూరు: చెన్నై వరదలు, సీజనల్ సెలవుల ప్రభావంతో దేశీయంగా మూడో అతి పెద్ద ఐటీ దిగ్గజం విప్రో .. అంచనాలకు అనుగుణమైన పనితీరే కనపర్చింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభ వృద్ధి రెండు శాతానికి పరిమితమై రూ. 2,234 కోట్లుగా నమోదైంది. ఐటీ సర్వీసుల ఆదాయం 9 శాతం పెరిగి రూ. 12,310 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 2,193 కోట్లు కాగా, ఆదాయం రూ. 12,085 కోట్లు. అంతర్జాతీయ ఇన్ఫ్రా సర్వీసులు తదితర విభాగాల్లో భారీ డీల్స్ దక్కించుకోగలిగామని విప్రో సీఈవో టీకే కురియన్ చెప్పారు. వినూత్న డిజిటల్ సామర్థ్యాలతో సమగ్రమైన టెక్నాలజీ సేవలు అందించడంపై తాము దృష్టి పెట్టనున్నట్లు కొత్త సీఈవోగా ఫిబ్రవరి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న ఆబిదాలీ నీముచ్వాలా తెలి పారు. రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కంపెనీ ఆమోదముద్ర వేసింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆదాయాలు స్వల్ప వృద్ధితో 1.87-1.91 బిలియన్ డాలర్ల మధ్య ఉండగలవని విప్రో పేర్కొంది. చెన్నై వరదల దెబ్బ.. మూడో త్రైమాసికంలో విప్రో ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్లు 21.8 శాతం నుంచి 20.2 శాతానికి పడిపోయాయి. కంపెనీ సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది ఉన్న చెన్నైలో వరదల వల్ల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడటం ఇందుకు కారణం. కాగా, క్యూ3లో కొత్తగా 39 క్లయింట్లను దక్కించుకోగలిగామని, ఏడు భారీ డిజిటల్ డీల్స్ కుదుర్చుకున్నామని కురియన్ చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.535 టార్గెట్ ధర: రూ.615 ఎందుకంటే: 1,690 కోట్ల డాలర్ల మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వినూత్నమైన. వినియోగదారుడు కేంద్రంగా ఐటీ సర్వీసులను, సొల్యూషన్లను, కన్సల్టింగ్, ఎంటర్ప్రైజ్, టెలికాం సొల్యూషన్లను అందిస్తోంది. 390 కోట్ల డాలర్ల టెక్ మహీంద్రా కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులతో 90 దేశాల్లో 788కి పైగా కంపెనీలకు తన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.రూ.720 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.786 కోట్లకు ఎగసింది. ఆదాయం రూ.5,488 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.6,615 కోట్లకు, ఇబిటా రూ.1,155 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,266 కోట్లకు పెరిగాయి. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.8.16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.3,492 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ2లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 788కు పెరిగింది. నార్డిస్ సర్వీసెస్, ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీ నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్(ఏసీజీఎస్) డెవలప్ చేయడానికి గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీనే ఎంపిక చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ సర్వీసెస్ భాగస్వామిగా టెక్ మహీంద్రాను ఏషియన్ టెలికాం కంపెనీ ఎంచుకుంది. డేటా సర్వీసుల టెస్టింగ్,డిజైన్, యాక్టివేట్ వంటి కార్యకలాపాలకు ఒక ఉత్తర అమెరికా టెలికాం కంపెనీ కూడా టెక్ మహీంద్రానే ఎంచుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 45 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇటీలనే ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్‌ను పొందింది. సీఈఎస్ఈ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.542 టార్గెట్ ధర: రూ.668 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. విద్యుత్తు టారిఫ్‌లు 8 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు పెరిగింది. విద్యుత్తు కొనుగోలు వ్యయం 58 శాతం, ఉద్యోగుల వ్యయం 7 శాతం చొప్పున పెరగడంతో ఇబిటా మార్జిన్లు స్వల్పంగా తగ్గి 24 శాతానికి పడిపోయాయి. ఇంధన వ్యయం 20 శాతం, ఇతర వ్యయాలు 14 శాతం చొప్పున తగ్గాయి. 2,325 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి కోల్‌కత, హౌరాలకు డిస్ట్రిబ్యూషన్ లెసైన్స్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 15.5 శాతం సాధిస్తోంది. ఏడాదికి రూ.500 కోట్ల నగదు నిలకడగా ఆర్జిస్తోంది. గత ఆరేళ్లుగా తన రిటైల్ విభాగం స్పెన్సర్స్‌లో రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఇలా పెట్టుబడులు పెట్టడం సీఈఎస్సీ నగదు స్థితిగతులపై ప్రభావం చూపినప్పటికీ, స్పెన్సర్ వ్యాపారం మెరుగుపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లోనే స్పెన్సర్స్ ఇబిటా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో స్పెన్సర్స్ ఆదాయం 23 శాతం, స్టోర్ ఏరియా 14 శాతం, స్టోర్ సేల్స్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2012-13లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీలో 57% వాటాను రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ రుణభారం తగ్గడానికి, మార్జిన్లు పెరగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈ ఏడాదిమార్చి నాటికి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ స్థూల రుణం 11 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 5 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్న కంపెనీగా మారనున్నది. 600 మెగావాట్ల చంద్రపూర్ ప్రాజెక్ట్‌కు ఇటీవలనే అనుమతులు సాధించింది. హల్దియా ప్లాంట్ ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించింది. అన్ని వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి సీఈఎస్సీ టార్గెట్ ధరను నిర్ణయించాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
ఏడాదిలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు
రెండు కంపెనీలను కొంటాం రే బిజ్టెక్ సీఈవో చైత్ మదునూరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసుల్లో ఉన్న రే బిజినెస్ టెక్నాలజీస్ (రే బిజ్టెక్) ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, తయారీ, రిటైల్, మీడియా, ట్రావెల్ తదితర రంగ కంపెనీలకు సేవలందిస్తున్న ఈ సంస్థ 2009లో అయిదుగురితో ప్రారంభమైందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో 215 మంది, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే కార్యాలయాల్లో 25 మంది ఉద్యోగులున్నారని రే బిజ్టెక్ సీఈవో చైత్ మదునూరి తెలిపారు. సిబ్బంది సంఖ్యను ఏడాదిలో ి500కు, 2018 కల్లా 2,000కు పెంచుకోనున్నామని చెప్పారు. సీఎంఎంఐ లెవెల్ 3 ధ్రువీ కరణ వచ్చిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సంస్థ సామర్థ్యానికి ఈ ధ్రువీకరణ నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ధ్రువీకరణ రాకతో విదేశాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మార్గం సుగమం అయిందని ఎండీ అజయ్ రే అన్నారు. యూఎస్‌కు చెందిన రెండు కంపెనీలను ఏడాదిలో కొనుగోలు చేస్తామని చైత్ వెల్లడించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్‌డేటా విభాగాల్లోకి ప్రవేశిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సొంత కార్యాలయం ఏర్పాటుకు స్థలం సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని, రూ.13 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తామని సీవోవో అజయ్ గుప్త తెలిపారు.