టెక్ మహీంద్రా చేతికి అమెరికా కంపెనీ
డీల్ విలువ 8.95 కోట్ల డాలర్లు
ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అమెరికాకు చెందిన ఐటీ సర్వీసుల కంపెనీని కొనుగోలు చేయనున్నది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీ సీజేఎస్ సొల్యూషన్స్ గ్రూప్ ఎల్ఎల్సీని కొనుగోలు చేయనున్నామని టెక్ మహీంద్రా తెలిపింది. హెచ్‌సీఐ గ్రూప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీలో 84.7% వాటాను 8.95 కోట్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. మిగతా 15.3% వాటాను మూడేళ్లలో కొనుగోలు చేస్తామన్నారు. ఆరో గ్య సంరక్షణ రంగంలో ఐటీ సేవలను మరింత విస్తరించడానికి, హెల్త్‌కేర్ కన్సల్టెంట్లకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జాక్సన్‌విల్లె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఐ గ్రూప్...ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సాఫ్ట్వేర్, శిక్షణ, సపోర్ట్ సర్వీసులను అందిస్తోంది.