టెక్ మహీంద్రా వాటాల విక్రయం
డీల్ విలువ సుమారు రూ. 33 కోట్లు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ఎల్‌సీసీ పాకిస్తాన్ సంస్థలో తమ అనుబంధ కంపెనీకి ఉన్న వాటాలను విక్రయించనున్నట్లు వెల్ల డించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ ఎల్‌సీసీ మిడిల్ ఈస్ట్ ఎఫ్‌జెడ్ సంస్థకు ఎల్‌సీసీ పాకిస్తాన్‌లో 100 శాతం వాటాలు వాటాలు ఉన్నాయి.
వీటిని స్విట్జర్లాండ్‌కి చెందిన టాక్‌పూల్ ఏజీకి విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 5.2 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 33.54 కోట్లు) ఉంటుందని టెక్ మహీంద్రా పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని తెలిపింది. 2008లో ప్రారంభమైన ఎల్‌సీసీ పాకిస్తాన్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. పాకిస్తాన్‌లో కీలక నెట్‌వర్క్ సర్వీసుల సంస్థగా ఎదగడానికి టాక్‌పూల్ సంస్థకు.. ఎల్‌సీసీని కొనుగోలు ఉపయోగపడనుంది.