నేడు దిగ్గజ కంపెనీలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎన్‌వీడియా కూడా ఉంది. సంస్థ ఏఐ ద్వారా చిప్‌లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రారంభంలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉండొచ్చని, సరఫరాలలో కొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.
ఎన్‌వీడియా చిప్‌ల తయారీ ఆలస్యం.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి వాటిపైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ గ్రేస్ హాప్పర్ AI సూపర్‌చిప్‌ను అనుసరించి మార్చిలో.. తన బ్లాక్‌వెల్ ఏఐ చిప్‌లను ఆవిష్కరించింది. ఇది ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని సమాచారం. ఆ తరువాత సరఫరా వేగవంతం అవుతుంది.
మార్కెట్లో హాప్పర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సంస్థ శ్రమిస్తోంది. అయితే ఈ వారం మైక్రోసాఫ్ట్, మరొక ప్రధాన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు చిప్‌ల సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎన్‌వీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment