ఎన్విడియా కంపెనీ యాపిల్‌ను అధిగమించింది.. మైక్రోసాఫ్ట్ తర్వాత రెండవ అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా మారింది. బుధవారం నాటికి షేర్స్ 5 శాతం పెరగటం వల్ల కంపెనీ విలువ 3.004 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ ముగిసే నాటికి యాపిల్ (2.99 ట్రిలియన్ డాలర్స్) కంపెనీ విలువ కంటే ఎన్విడియా విలువ పెరిగింది.
మైక్రోసాఫ్ట్ విలువ 3.15 ట్రిలియన్స్. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2002 చివరి వరకు ఎన్విడియా యాపిల్ కంటే విలువైన కంపెనీ. అయితే యాపిల్ కంపెనీ ఎప్పుడైతే మొదటి ఐఫోన్ విడుదల చేసిందో.. ఆ తరువాత ఎన్విడియాను అధిగమించింది.
ఎన్విడియా సంస్థ యాపిల్ కంపెనీకి అధిగమించిన సందర్భంగా కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతూ.. ఏఐ యాక్సిలరేటర్లను ప్రతి సంవత్సరం అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జెన్సన్ హువాంగ్ సంపద 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెరిగి ఏకంగా 107.4 బిలియన్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment