మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్‌సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.
జెన్‌సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్‌సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.
మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment