బత్తలపల్లి: టెక్నాలజీ మహిమ..అంతా మాయ. కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇట్టే మోసం చేస్తున్నారు. తెలివిమీరిపోయిన కొందరు కేటుగాళ్లు... బత్తలపల్లిలోని చిరు వ్యాపారులకు టోకరా వేశారు. రూ.10 విలువైన వస్తువులు కొని రూ.200, రూ.500 నోట్లు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుని మరీ వెళ్లారు.
ఆ నోట్లు తీసుకుని బ్యాంకులకు వెళ్లిన చిరువ్యాపారులు అవి కలర్ జిరాక్సు పేపర్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసాలు ఇటీవల బత్తలపల్లిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కూడలిలో ఆటోవాలాకు ఓ వ్యక్తి ఇలాగే కలర్ జిరాక్స్ నోటు ఇచ్చాడు.
అలాగే జొన్నరొట్టెలు విక్రయించే వృద్ధురాలినీ ఓ ఆగంతకుడు ఇలాగే మోసం చేశాడు. కలర్ జిరాక్స్ నోట్ల బాధితుల్లో ఎక్కువగా చిరువ్యాపారులే ఉండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment