
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్‌వై వార్తా కేంద్రం తెలిపింది.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్‌లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్‌బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు.
షౌకత్ పిల్లలు పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు.