ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు! | Millionaire beggar nabbed in Saudi Arabia | Sakshi
Sakshi News home page

ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు!

Published Fri, Jul 25 2014 8:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు!

ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు!

రియాద్: సౌదీ అరేబియాలో అడుక్కోవటం నిషేధం. అయితే అక్కడ అక్రమంగా ఉండటమే కాకుండా.. అరబ్ జాతీయుడైన ఓ వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి భిక్షమెత్తుకుంటూ సైతం పోలీసుల కంటపడ్డాడు. ఇంకేం.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జస్ట్ ఫార్మాలిటీస్ కోసమని.. విచారించడంతో పాటు సోదాలు చేసేందుకని అతడి ఇంటికి వెళ్లారు. తీరా అతడి ఇంటిని చూస్తేనే పోలీసులకు కళ్లు తిరిగిపోయాయి. విలాసవంతమైన అపార్టుమెంట్‌తో పాటు ఖరీదైన కారు కూడా ఉండటం చూసి విస్తుపోయారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడంతో ఏకంగా రూ.1.80 కోట్ల విలువైన 12 లక్షల సౌదీ రియాల్స్ దొరకడంతో మరింత ఆశ్చర్యపోయారు.

 

వీటితో పాటు ఓ గల్ఫ్ దేశంలో పెట్టుబడి పెట్టేందుకు అతడు ఇన్‌వెస్టర్ లెసైన్సు కూడా పొందడం చూసి ఔరా! అనుకున్నారు. చివరికి.. చట్టవ్యతిరేకంగా దేశంలో ఉండటంతోపాటు చట్ట వ్యతిరేకంగా అడుక్కున్న నేరానికిగాను కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఈ మేరకు ‘సౌదీ గెజిట్’ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఆ కోటీశ్వర బిచ్చగాడు ఏ దేశానికి చెందినవాడు, వివరాలేంటి? అన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement