టీ.నగర్(చెన్నై): మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యాపారవేత్త ఆధార్ కార్డు సాయంతో కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీలోని రాల్పూర్‌లో డిసెంబర్ 13న భిక్షాటన చేసుకుంటున్న ఓ యాచకుడ్ని గుర్తించిన స్వామి భాస్కర్ స్వరూప్‌జీ అతడికి ఆశ్రయం కల్పించి ఆహారం అందజేశారు. తొలుత జుత్తు కత్తిరించి సదరు యాచకుడికి స్నానం చేయించబోగా అతనివద్ద ఆధార్ కార్డుతో పాటు రూ.1.06 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు, లాకర్ తాళం బయటపడ్డాయి. ముత్తయ్య నాడార్ పేరుతో ఉన్న ఆధార్ సాయంతో ఆయన కుటుంబ సభ్యుల్ని స్వరూప్‌జీ సంప్రదించారు. దీంతో నాడార్ తమిళనాడులోని తిరునెల్వేలిలో పెద్ద వ్యాపారవేత్తని తేలింది. సమాచారం అందుకున్న నాడార్ కుమార్తె గీత ఆయన్ను తీసుకెళ్లేందుకు రాల్పూర్‌కు చేరుకున్నారు. ఆరు నెలల క్రితం రైల్లో వెళ్తుండగా నాడార్ తప్పిపోయినట్లు గీత తెలిపారు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించడంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారన్నారు. తన తండ్రికి ఆశ్రయం కల్పించినందుకు స్వామి భాస్కర్‌కు గీత కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment