Locker
-
లక్షలు కొట్టేసి.. ఏం చేయాలో తెలియక అక్కడ పెట్టాడు.. చివరికి
భువనేశ్వర్: దొంగిలించిన సొమ్మును ఏం చేయాలో తెలీక ఇంటి వెనుక గత్తం కింద దాచిపెట్టాడో ప్రబుద్ధుడు. పోలీసులు గుట్టు రట్టు చేయడంతో పరారైపోయాడు. హైదరాబాద్ వ్యవసాయ పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది సొమ్మును దొంగిలించి దాచాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం రాష్ట్రానికి విచ్చేసి ఈ దోపిడీ గుట్టు రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బాలాసోర్ జిల్లా బొడొమొందారుణి గ్రామానికి చెందిన గోపాల్ బెహరా అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి రూ. 21 లక్షలు దోచుకున్నాడు. దోచుకున్న నగదుని బావమరిది ద్వారా స్వస్థలానికి సురక్షితంగా తరలించాడు. నిందితుని అత్తమామలు ఈ సొమ్ముని సంచిలో పదిల పరచి ఇంటి పెరట గత్తం కుప్ప కింద దాచి పెట్టారు.గోపాల్ బెహరా గత పదేళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ అనుభవంతో లాకరు రహస్య నంబరు వగైరా అనుబంధ సమాచారం గుట్టుగా తెలుసుకుని భారీ మొత్తాన్ని కాజేశాడు. కాజేసిన సొమ్ముని బావమరిది ద్వారా జలేశ్వర్లో అత్త వారింటికి తరలించాడు. కంపెనీలో నగదు గల్లంతు విషయమై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ దర్యాప్తు బృందం రాష్ట్రానికి చేరింది. స్థానిక కొమొర్దా ఠాణా పోలీసుల సహకారంతో నిందితుని అత్త వారింటికి చేరి గాలింపు, తనిఖీలు చేపట్టింది. దర్యాప్తులో ఇంటి పెరట్లో గత్తం కుప్ప కింద దోచుకున్న సొమ్ము పాతిపెట్టినట్లు గుర్తించారు. గత్తం కుప్ప తవ్వడంతో వాస్తవం తేలింది. మరో వైపు ప్రధాన నిందితుడు, అతని మామ ఉమాకాంత బెహరా పరారీలో ఉన్నాడు. అతని బావమరిది రబీంద్ర బెహరాని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుని అత్త బాసంతి బెహరాని కూడా ప్రశ్నిస్తున్నారు. గత్తం తవ్వడంతో రూ. 15 లక్షలు మాత్రమే బయటపడినట్లు దర్యాప్తు బృందం వివరించింది. ఈ నెల 11న హైదరాబాదు వ్యవసాయ కంపెనీలో రూ. 21 లక్షల చోరీకి గురైంది. దీని ఆధారంగా దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇక్కడ దొరికిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోను సంభాషణ వివరాలు ఆధారంగా దోపిడీ నుంచి తరలింపు వరకు జరిగిన ప్రక్రియ గుట్టు రట్టుకు దర్యాప్తు బృందం వ్యూహ రచన చేసింది. కేసు విచారణ, దర్యాప్తు కొనసాగుతుంది.ఇవీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! -
కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది. -
‘డిజి లాకర్’లో ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ఫ్లాట్ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేసి, డిజి లాకర్లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. ఐఐటీ, నీట్‌తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్లో పొందవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుని నకళ్లు (డూప్లికేట్) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్‌తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇలా.. 2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. విద్యార్థులు తమ పాస్ మెమోల కోసం డిజి లాకర్ యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ‘క్లాస్ గీ మార్క్‌షీట్’ ఓపెన్ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్’పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అయ్యి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు మొబైల్ ఫోన్లోని డిజి లాకర్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్ మెమో, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్ ఫోన్లో డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో https://digilocker.gov.in లో లాగిన్ చేయాలి. వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్‌లో నింపి సబ్మిట్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేస్తే అందులో ‘క్లాస్ గీఐఐ’ ఓపెన్ చేస్తే ‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిపై ‘క్లిక్’ చేయాలి. రోల్ నంబర్/ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?
బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్లో దాచింది. అయితే ఆర్బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి' లాకర్‌ను తెరిచే అధికారం ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్ కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. -
గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. గడువు పొడిగించింది
ముంబై: సవరించిన సేఫ్ డిపాజిట్ లాకర్ల ఒప్పందాలను కస్టమర్లతో బ్యాంక్‌లు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇందుకు ఈ ఏడాది చివరి వరకు గడువును ఆర్బీఐ పొడిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లాకర్ల ఒప్పందాల్లో మార్పులు చేసి, వాటిపై కస్టమర్ల సమ్మతి తీసుకోవాలంటూ 2021 ఆగస్ట్‌లోనే ఆర్బీఐ అన్ని బ్యాంక్‌లను కోరింది. ‘‘పెద్ద సంఖ్యలో కస్టమర్లు నవీకరించిన లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. గడువులోపు (2023 జనవరి 1 నాటికి) లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాలంటూ కస్టమర్లకు చాలా వరకు బ్యాంక్‌లు తెలియజేయలేదు. కనుక 2023 ఏప్రిల్ 30 నాటికి లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాల్సిన విషయాన్ని కస్టమర్లకు బ్యాంక్‌లు విధిగా తెలియజేయాలని కోరాం. జూన్ 30 నాటికి కనీసం 50%, సెప్టెంబర్ 30 నాటికి కనీసం 75% కస్టమర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఒప్పందం కాపీని కస్టమర్‌కు అందించాలి’’ అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. జనవరి 1 నాటికి ఒప్పందాలు చేసుకుని లాకర్లను స్తంభింపజేస్తే, వాటిని తిరిగి విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
బ్యాంకులో బంగారం మాయం!
సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్): ఆర్కే నగర్‌లోని లక్ష్మీ విలాస్ బ్యాంక్( డీబీఎస్ బ్యాంక్) లో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారం మాయమైంది. ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్కాజిగిరి పోలీసులు, ఫిర్యాదుదారుడు పేర్కొన్న వివరాల ప్రకారం... లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సాయి గౌతమ్ లాకర్ రూం ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 9న కొంత నగదు డ్రా చేసి తన లాకర్లో పెట్టి.. దానిని మరుసటి రోజు (10న) తీసుకున్నాడు. 11న తన వద్ద ఉన్న లాకర్ తాళం కనిపించలేదు. దానికి కోసం వెతికినా దొరకలేదు. ఈ నెల 17న లాకర్ కంపెనీ వాళ్లను పిలిపించి తెరిపించగా అందులో భద్రపర్చిన బంగారం కనిపించలేదు. ఈ మేరకు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సాయిగౌతమ్ మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. డీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జవాన్, క్లూస్ టీమ్ అధికారి నందకుమార్‌లు బ్యాంక్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. అతడి పనేనా? అసిస్టెంట్ మేనేజర్ సాయి గౌతం చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదు. ఈ నెల 17వ తేదీ లాకర్ తెరిపించిన తర్వాత బంగారు ఆభరణాల కనిపించకపోతే శనివారం ( 21న) పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని లాకర్లకు సంబంధించిన మాస్టర్ కీస్ అతడి వద్దే ఉంటాయి. తన లాకర్‌కు సంబంధించిన కస్టమర్ తాళం పోయిందని చెప్పడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో గత 20 రోజులుగా సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. చదవండి: కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్ -
క్షణం క్షణం ఉత్కంఠ ... పరుగులు పెట్టించిన బీరువా కథ : గద్వాల్
-
Gold: డిజిటల్ గోల్డ్‌తో.. లాభాల పంట
చేతిలో డబ్బులుండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చాలా మందికి తెలియదు. అలా అవగాహనలేక పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతుంటారు. అయితే అలాంటి వారు డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్‌ని మనం ఆఫ్ లైన్ అంటే షాప్‌కి వెళ్లి కొనుగోలు చేస్తాం. అదే డిజిటల్ గోల్డ్‌ను ఇంట్లో ఉండి ఆన్ లైన్ లో కొనుగోలు చేయోచ్చు.దానిపై ఇన్వెస్ట్ చేసి లాభాలొచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అవగాహన అవసరం డిజిటల్ గోల్డ్‌ని యాప్స్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ గోల్డ్ యాప్స్ పనిచేస్తాయి. అయితే ఆన్లైన్లో కొనుగోలు చేసే గోల్డ్ గురించి తెలుసుకొని కొనుగోలు చేయాలి. అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు/ అమ్మకం ఎలా చేయాలి ..? ♦ ముందుగా మీకు తెలిసిన డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. ♦ మీరు గోల్డ్‌ని రూపాయల్లో కానీ గ్రాముల్లో కానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ♦ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్న తరువాత మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాలి. ♦ పూర్తి వివరాల్ని ఎంటర్ చేసిన తరువాత పేమెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. డబ్బులు చెల్లిస్తే చాలు మీరు బంగారం కొనుగోలు చేయడం పూర్తవుతుంది. మరి కొన్న బంగారం ఎక్కడుంటుందనే అనుమానం రావొచ్చు. బ్యాంకులు డిజిటల్ గోల్డ్‌ను అమ్ముతుంటుంది. అలా డిజిటల్ గోల్డ్‌ను అమ్మే బ్యాంకుల్లో ఉన్న లాకర్లలో మీరు కొన్న బంగారాన్ని భద్రపరుస్తారు.ఆ బంగారాన్ని మీకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చు. -
కట్టలు కట్టలుగా డబ్బు..
సాక్షి, నిజామాబాద్ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కామారెడ్డి సీఐ జగదీశ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్‌కి సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి.. 34,40,000 రూపాయల నగదుతో పాటు 9 లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను సీజ్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావుతెలిపారు. సస్పెండైన సీఐ జగదీశ్‌కు సంబంధించి అక్రమాస్తులను గుర్తించే పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున జగదీష్ భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) -
ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఏసీపీ వై.నరసింహారెడ్డి రెండో లాకర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. భారీగా నగదు, కీలక ఆధారాలు ఈ ఎస్బీఐ లాకర్లో లభిస్తాయని అధికారులు భావించారు. అయితే అది ఖాళీగా ఉండటంతో అవాక్కయ్యారు. రెండుమూడేళ్లుగా ఈ లాకర్ వినియోగంలోనే లేదని తెలుసుకుని వెనుదిరిగారు. మరోవైపు ఏసీపీకి బినామీలుగా వ్యవహరించిన వారి కోసం ఏసీబీ గాలింపు ముమ్మరం చేసింది. అందులో కొందరు నగరంలో లేరని, వారు ఫోన్లు కూడా అందుబాటులో లేవని సమాచారం. ఓ డీఐజీ ర్యాంకు అధికారికి బంగ్లా కొనివ్వ డంలో కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలపైనా ఏసీబీ దృష్టి సారించింది. రూ.4 కోట్ల విలువైన ఆ బంగ్లాను సదరు డీఐజీ ఇప్పటికే అమ్మేసుకున్నాడని తెలిసింది. (మేరే పీచే బాస్ హై!) నెల ముందే తెలిసిందా...? తాను చేసే పనులకు డీజీపీ పేరును వాడుకున్న నరసింహారెడ్డికి డిపార్ట్మెంట్లో మంచి నెట్వర్క్ ఉంది. ఇటీవల ఏసీపీ జయరాంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వెంటనే.. తరువాత టార్గెట్ తానేనని గుర్తించి ఉంటాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఆయన ఎవరితోనూ ఫోన్లో వాయిస్ కాల్ చేయలేదని.. వాట్సాప్, ఇతర యాప్‌ల ద్వారా బినామీలను సంప్రదించినట్లు సమాచారం. లాకర్లలో తక్కువ స్థాయిలో బంగారం లభించడం, కీలక బినామీలు నగరంలో లేకపోవడం ఏసీబీ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అలాగే పలువురు రాజకీయ నాయకులతో కలసి చేసిన వ్యాపారాలు, నగరంలో పలు రియల్ ఎస్టేట్లలో నరసింహారెడ్డి పెట్టిన పెట్టుబడులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. -
‘లాకర్’ గుట్టు వీడేనా..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్‌కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్‌గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్‌పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు. బినామీలు, వారి ఖాతాలపై నజర్ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్‌తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు. రియల్టర్‌పై నజర్.. మెదక్ జిల్లాలో రెండు చోట్ల విద్యాసంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.., అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు భూవ్యవహారాల్లో ఏసీకి అన్నీ తామై కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ కేంద్రంగా తతంగం నడిపించినట్లు గుర్తించారు. వీరిని సైతం ఏసీబీ త్వరలో విచారించనున్నట్లు తెలిసింది. లాకర్, బీరువా తెరిచేందుకు సన్నాహాలు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నగేశ్‌ను ఏసీబీ అధికారులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. సోదాల సమయంలో అదనపు కలెక్టర్ దంపతులు అధికారులకు సహకరించకుండా బ్యాంక్ లాకర్, బీరువా తాళం చెవులు లేవంటూ మొండికేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో వీటిని తెరిచేందుకు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. వీటిని తెరిస్తే నగదు, బినామీల బాగోతం వెలుగుచూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మాజీ కలెక్టర్‌కు నోటీసులు చిప్పల్తుర్తి భూములకు సంబంధించి 112 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22–ఏ నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్డీఓ అరుణారెడ్డి ఏసీబీకి కీలక సమాచారం ఇవ్వడంతో అధికారులు దూకుడుగా ముం దుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్ లాకర్ రూమ్’అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిపై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న మైనర్ విద్యార్థులపై ఢిల్లీ పోలీస్‌కు చెందిన సైబర్ క్రైమ్ విభాగం చర్యలు తీసుకుంది. ఆ గ్రూప్ అడ్మిన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించింది. ఢిల్లీలోని 3 ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించింది. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేయడం, వాటిని ఆ గ్రూప్ చాట్ రూమ్‌లో షేర్ చేసుకుంటూ అసభ్యంగా, గ్యాంగ్ రేప్ చేయాలంటూ నేరపూరితంగా సందేశాలు పంపుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇతర మాధ్యమాల్లో వైరల్ అయ్యి, సంచలనం సృష్టించడంతో సైబర్ క్రైమ్ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఒక బాలిక ఈ గ్రూప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం? గ్రూప్‌లో 13–18 ఏళ్లలోపువారు.. నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 27 మంది గ్రూప్ సభ్యులను పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చాలామంది 11, 12 తరగతుల వారే. గ్రూప్‌లో 13 ఏళ్ల విద్యార్థి నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థి వరకు ఉన్నారు. ఆ గ్రూప్‌లోని మైనర్ సభ్యులను పోలీసులు వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 51 మంది సభ్యులున్నారని, మార్చి నెలాఖరులో తమను చేర్చుకున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు. బాలికలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేసుకున్న ఫొటోలను వీరు అసభ్యంగా మార్ఫ్ చేసి బాయిస్ లాకర్ రూమ్ గ్రూప్‌లో షేర్ చేసేవారు. ఈ గ్రూప్ వివరాలను ఇన్స్టాగ్రామ్ నుంచి కోరామని, వారి నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. జువనైల్ జస్టిస్ చట్టం ప్రకారం మైనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీఎన్ పటేల్‌కు లేఖ రాశారు. పోక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. చదవండి: డర్టీ ఛాట్ -
లాకర్లలో మూడు కిలోల బంగారం
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వుతున్నకొద్దీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శరగడం వెంకటరావు అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే భారీగా ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో దొరికిన బ్యాంకు పాసు పుస్తకాల ఆధారంగా లాకర్లను సోమవారం తెరిచారు. ఆ సమయంలో కనిపించిన బంగారు, వెండి వస్తువులు చూసిన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎస్బీఐ కంచరపాలెం బ్రాంచిలోని లాకరులో 10 కిలోలు వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే బ్రాంచిలోని మరో లాకర్లో 1.3 కిలోల బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించారు. మురళీనగర్‌లో గల మహారాష్ట్ర బ్యాంకు లాకరులో 1.8 కిలోల బంగారు నగలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ రమాదేవి మాట్లాడుతూ విచారణ చేపడుతున్నకొద్దీ వెంకటరావుకు సంబంధించిన అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయన్నారు. ఇప్పటికే లాకర్లలోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. బంగారం, వెండి వెంకటరావు భార్య, కుమార్తె, కోడలు పేరు మీద ఉన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా మిగిలిన లాకర్లలో మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటిని మంగళవారం పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వెంకటరావును అరెస్ట చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో ఆదివారం హాజరుపరచగా ఈ నెల 16 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. -
మీ ‘సేఫ్’ లాకర్ ఎక్కడ?
బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు చాలా మంది బ్యాంకుల్లోని సేఫ్లాకర్లను ఆశ్రయిస్తారు. ఇది సర్వసాధారణం. కారణం... బ్యాంకు లాకర్లలో ఉంచితే ఎంతో భద్రంగా ఉంటాయన్న నమ్మకం!!. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బ్యాంకు లాకర్ మాత్రమే అద్దెకిస్తుంది. అంతవరకే దాని బాధ్యత. అందులో మనం ఏం దాచామన్నది బ్యాంకుకు తెలియదు. అనవసరం కూడా. కాబట్టి ఆ లాకర్లలో మనం దాచిన వస్తువులు పోతే... అందుకు బ్యాంకుల బాధ్యత ఉండదని ఈ మధ్యే ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. అలాగే, కొన్ని చోట్ల బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టి విలువైన వస్తువుల్ని దోచుకుపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. దీంతో బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువుల భద్రత విషయంలో ఖాతాదారులు మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయాలేంటి? ఎక్కడైతే సురక్షితంగా దాచుకోగలం? అసలు బ్యాంకు లాకర్లలో ఉంచిన వారు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?... ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మంచి కంపెనీల సేఫ్టీ లాకర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకుని ఇంట్లోనే ఓ చోట ఏర్పాటు చేసుకోవడం ఒక పరిష్కారం. ఇందులో కొన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే, కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా లాకర్లలో ఉంచిన వాటిని తీసుకోవచ్చు. బ్యాంకుల్లో అయితే నిర్ణీత సమయాల్లోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రైవేటుగా లాకర్ సేవలందించే సంస్థలు కూడా రోజువారీ సమయాలను పాటిస్తాయి. పైపెచ్చు సెలవు రోజుల్లో మూసి ఉంచుతాయి. ఇక బ్యాంకు లాకర్లయితే ఏడాదిలో కనీసం ఒకసారయినా లాకర్‌ను తెరవాలన్న నిబంధన ఉంటుంది. ఒకవేళ అలా తెరవలేని పక్షంలో ఎందుకు తెరవలేదో చెప్పాలని కోరుతూ బ్యాంకు నోటీసు జారీ చేస్తుంది. దానికి సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి స్పందించకపోతే లాకర్‌ను బలవంతంగా తెరవడం జరుగుతుంది. బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులుంచినపుడు వాటిని అవసరానికి తీసుకురావడం, పని ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ తీసుకెళ్లి లాకర్లలో పెట్టడం కాస్తంత శ్రమ, సమయంతో కూడినది. పైగా క్యారీ చేసే సమయంలో దోపిడీ భయం ఉండనే ఉంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకుంటే ఈ విధమైన ఇబ్బంది ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. చార్జీలు ఎలా ఉంటాయంటే... బ్యాంకు లాకర్‌ను అద్దెకు తీసుకునేటపుడైనా... దానికి బదులు సొంతంగా లాకర్ కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేసుకునేటపుడైనా వాటికయ్యే ఖర్చును పోల్చి చూడాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో లాకర్ అద్దెలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. లాకర్ సైజును బట్టి కూడా ఈ చార్జీలు మారుతుంటాయి. చిన్న లాకర్‌కు అయితే ఎస్బీఐ సంవత్సరానికి పట్టణాల్లో రూ.1,100, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో రూ.800 చొప్పున వసూలు చేస్తోంది. పెద్ద లాకర్ అయితే ఈ అద్దె పట్టణాల్లో రూ.8,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,000గా ఉంది. పైపెచ్చు బ్యాంకుల్లో లాకర్ కోసం మూడేళ్ల అద్దెను కూడా డిపాజిట్ చేయాల్సి రావచ్చు. ప్రైవేటు సంస్థలయితే తిరిగి చెల్లించే మూడేళ్ల అద్దెను డిపాజిట్ చేయాలని కోరుతున్నాయి. ఈ సంస్థలు వసూలు చేసే అద్దె ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటోంది. ఇక ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫలానా వారే దాన్ని తెరవాలి, ఇన్ని సార్లే తెరవాలన్న అడ్డంకులేవీ ఉండవు. బ్యాంకులు లాకర్లను తెరిచే విషయంలో ఏడాదికి ఇన్ని సార్లేనన్న పరిమితులు అమలు చేస్తున్నాయి. అంతకు మించితే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ అయితే ఏడాదికి 12 సార్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత నుంచి ప్రతీ సందర్శనకు రూ.100 చార్జీ విధిస్తోంది. అలాగే, బ్యాంకులు ఇద్దరు వ్యక్తులను జాయింట్ హోల్డర్లుగా లాకర్‌ను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతిస్తుంటాయి. వీరు మినహా మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు. నామినీని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దొంగల నుంచి కాపాడుకునే బాధ్యత ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు, ఎవరైనా చొరబడితే గుర్తించి అప్రమత్తం చేసే పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. లాకర్ ఎంపిక ఎలా? ఇంట్లో ఏర్పాటు చేసుకునే లాకర్లకు సంబంధించి ఎన్నో సైజులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కనిపించేవి ‘కీ’తో ఉండే మెకానికల్ లాకర్లు. అలాకాకుండా ఎలక్ట్రానిక్ కీప్యాడ్‌లతో కూడిన ఖరీదైన లాకర్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. కార్డుల స్వైప్‌తో, బయోమెట్రిక్ ద్వారా యాక్సెస్ చేసుకునేవీ దొరుకుతున్నాయి. మెకానికల్ లాకర్ల కంటే ఈ తరహా లాకర్ల ఖరీదు దాదాపు 50 శాతం ఎక్కువ ఉంటోంది. ఉదాహరణకు గోద్రెజ్ 23 లీటర్ల ఎలక్ట్రానిక్ మోడల్ లాకర్ ధర రూ.11,522. అదే మెకానికల్ లాకర్ ధరయితే రూ.8,000. లాకర్ బరువు కూడా చూడాల్సి ఉంటుంది. చాలా బరువుతో ఉండేవి ఎంచుకోవడం వల్ల దొంగలెవరైనా చొరబడి వాటిని ధ్వంసం చేయాలనుకున్నా, తీసుకెళ్ళాలనుకున్నా కష్టమవుతుంది. అలాంటి వాటి ధర ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. 30 లీటర్ల ఎలక్ట్రానిక్ సేఫ్ లాకర్, 14 కిలోల బరువున్న దాన్ని పెప్పర్ఫ్రైలో కొనుగోలు చేయాలంటే ధర సుమారు రూ.12,200 వరకూ ఉంది. 18 కిలోల బరువుతో ఉన్న దాని ధర రూ.13,530. ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇళ్లలో లాకర్‌ను పెట్టుకోవాలనుకున్న వారు... దాన్ని ఎక్కడ ఉంచాలన్నది కూడా ఆలోచించతగినదే. ఇంటి నిర్మాణ సమయంలోనే లాకర్‌ను కొని ఏర్పాటు చేయించుకోవడం మంచి ఆలోచన. ఇలా చేస్తే లాకర్ కనిపించకుండా చేసుకునేందుకు వీలుంటుంది. నిర్మాణం పూర్తయిన ఇంట్లో అయితే గోడలకు స్క్రూతో గట్టిగా ఫిట్ చేయించుకోవాలి. కాకపోతే ఇలా లాకర్‌ను ఏర్పాటు చేసేటపుడు ఎవరికీ తెలియకుండా చూసుకోవటం తప్పనిసరి. ఇల్లు కట్టేటపుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అగ్ని ప్రమాద నిరోధ లాకర్లు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే ఈ లాకర్లలో ఉంచిన డాక్యుమెంట్లకు కాలిపోయే రిస్క్ ఉండదు. ఏ మేరకు భద్రత అవసరం అన్నదాన్ని బట్టి ఈ ఫీ చర్లను జోడించుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, ధర కూడా ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. బీమా తప్పనిసరి బ్యాంకు లాకర్ అద్దెకు తీసుకున్నా లేక ఇంట్లో లాకర్‌ను ఏర్పాటు చేసుకున్నా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం బీమా పాలసీ తీసుకోవడం. లాకర్లలో ఉంచిన వస్తువులు మాయం అయితే బ్యాంకులు బాధ్యత తీసుకోవడం లేదు. కనుక అందులో ఉంచిన వాటి విలువకు సమానంగా బీమా రక్షణతో పాలసీ తీసుకోవడం అవసరం. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా వాటికి బీమా రక్షణ లభిస్తుంది. బీమా పాలసీ తీసుకునే వారు బ్యాంకు లాకర్లలో ఉంచినవి కోల్పోతే కచ్చితంగా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు శాఖలు పటిష్ట భద్రతతో ఉంటాయి కనుక. కానీ, ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకుని అందులో విలువైన వాటిని ఉంచిన వారు బీమా ఉందిలే అని నిర్లక్ష్యం చూపిస్తే పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకునే వారు సీసీ కెమెరాలు, పటిష్టమైన లాకర్, అగ్ని నిరోధక తదితర అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. అప్పుడే క్లెయిమ్ తిరస్కరణ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. -
డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్..!
వరంగల్ క్రైం : హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ లాకర్ వ్యవహారం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. బ్యాంక్ లాకర్ 27/2లో లభ్యమైన డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్ వ్యవహారానికి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ అయుబ్ ఔట్ అయ్యారు. ఈనెల 8న బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన లాకర్ వ్యవహారం ఎట్టకేలకు బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుంది. బ్యాంక్‌లో తుపాకీ విషయం వెలుగుచూసిన తర్వాత డీసీసీబీ ప్రత్యేక పరిపాలన అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత హన్మకొండ జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్‌ను బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వరంగల్ అర్బన్ డీసీఓ కరుణాకర్ బ్యాంకులో 8న లాకర్ 27/2 కలిగిన బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డిని బ్యాంకు మేనేజర్ పిలిపించి లాకర్‌ను అద్దెకు తీసుకోకుండా, లాకర్ తాళంచెవి పోయినందుకు, దాన్ని ఓపెన్ చేయడానికి టెక్నీషియన్ చార్జీలకు సంబంధించిన డబ్బులను ఆగస్టు 8న బ్యాంకులో జమచేయలేదు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విచారణ అధికారులు భావించారు. టెక్నీషియన్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పిస్తోల్, బుల్లెట్ బయటపడిన తర్వాత సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చేరవేయలేదు? అనే విషయంపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల్లో అధికారులు నిబంధనలు పాటించకపోవడంపై కూడా విచారణ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. బ్యాంకు లాకర్ విషయంలో జరిగిన అంశాలతోపాటు ప్రస్తుత పరిస్థితులపై డీసీఓ కరుణాకర్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి ఎం.హరితకు ఈనెల 24న నివేదిక అందజేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బ్యాంకు వ్యవహారంలో నిబంధనలు పాటించనందుకు బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బ్యాంకు సీఈఓ అంజయ్య ప్రస్తుత మేనేజర్ ఎండీ.అయూబ్బేగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొనసాగుతున్న పోలీసుల విచారణ బ్యాంకు లాకర్లో బయటపడ్డ డమ్మీ పిస్తోల్ వ్యవహారంలో సుబేదారి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాకర్లో తుపాకీ ఎవరు పెట్టారు?, అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంత? బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది? రాజకీయ నేతలు ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే విషయాలపై ఓ వైపు విచారణ సాగుతుండగా, మరోవైపు శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకు ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు లావాదేవీల విషయంలో నిబంధనలు పాటించనందుకు మేనేజర్ అయూబ్ బేగ్ సస్పెండ్ అయ్యారు. డమ్మీ పిస్తోల్ విషయంలో పోలీసులు ఎవరిని దోషులుగా గుర్తిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరి కొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఆ సంపద వెనుక?
ఒక సాధారణ టెన్నిస్‌కోర్టు లాకర్లో గుట్టలు గుట్టలుగా నగదు, బంగారు, వజ్రాలు, ఆస్తుల పత్రాలు వెలుగుచూడడం ఉద్యాననగరిలో చర్చనీయాంశమైంది. లాకర్ల సొంతదారు అవినాశ్ అమరలాల్తో పాటు ఇంకా కొందరు బలమైన రాజకీయ నాయకులకు ఈ లాకర్ సంపదలో భాగస్వామ్యం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్లోని లాకర్లో పెద్దమొత్తంలో దొరికిన నగదు, నగల వ్యవహారంపై అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త అవినాశ్ అమరలాల్ కుక్రేజా బినామీ పేరుతో క్లబ్లో లాకర్ తీసుకుని డబ్బులను దాచిన్నట్లు పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం సంపదను ఐటీ స్వాధీనం చేసుకోవడంతో కొందరు మంత్రులకు ఊపిరి ఆడడం లేదని సమాచారం. అవినాశ్‌ను ఐటీ అదుపులోకి తీసుకుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్ణాటకకు చెందిన ఇద్దరు బలమైన మంత్రులు, బళ్లారికి చెందిన ఒక కాంగ్రెస్ శాసనసభ్యునికి చెందిన ఆస్తిపత్రాలు ఈ లాకర్లో లభించినట్లు తెలిసింది. శనివారం ఇక్కడ మూడు లాకర్లను అధికారులు బద్దలు కొట్టగారూ.3.90 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, వందల కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు దొరకడం తెలిసిందే. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. పోలీసులు, ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక బ్యాగ్‌లో రెండు వేలకు పైగా సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, బెంగళూరులోని సహకార నగరలోని 250 కోట్ల విలువ గల ఐదు ఎకరాల భూమి పత్రాలు, శోభా డెవలపర్స్, ఇట్టినా, నితీశ్, ప్రెస్టిజ్ డెవలప్మెంట్ సంస్థలకు చెందిన పత్రాలున్నాయి. అవినాశ్‌కు మైసూరులో, బెంగళూరులో అనేక ఇళ్లు ఉన్నాయి. గుట్టుగా ఉంచేందుకు లంచం ఎర అవినాశ్ బెంగళూరు టౌన్‌హాల్ ఎదురుగా భవనంలో తన ఆఫీసు నిర్వహిస్తున్నారు. రెండు, మూడు పడక గదులున్న నివాసాలు, లెక్కలేనన్ని ఇంటి స్థలాలు ఈ డాక్యుమెంట్లలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. లాకర్లోని సంపద బయటకు రాకుండా చూస్తే రూ.4 కోట్ల ముడుపులు ఇస్తానని బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు ఆశ చూపారు. గంట తర్వాత ఒక సీనియర్ మంత్రి అనుచరుడు ప్రకాశ్‌ను కలిసి రూ. 5కోట్లు తీసుకోండి, ఎవరికీ చెప్పవద్దు అనిఆయనకు ప్రలోభాలకు గురిచేశారు. కానీ క్లబ్ కార్యదర్శి ససేమిరా అని తన నిజాయితీని చాటుకోవడంతో ఈ భారీ ధనం దందా బయట పడింది. ఎలాగైనా విచారణను అడ్డుకోవాలని ప్రయత్నంలో అవినాశ్ పెద్దస్థాయిలో లాబీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినాశ్‌ను ప్రశ్నిస్తున్న ఐటీ కోట్ల రూపాయిల విలువగల ఆస్తి పత్రాలు, నగదు, అభరణాలకు సంబంధించి వ్యాపారవేత్త అవినాశ్ అమరలాల్ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆస్తి ఎలా వచ్చింది, బౌరింగ్ లాకర్లో ఎందుకు దాచిపెట్టారు? అని ప్రశ్నిస్తున్నారు. అతనికి చెందిన అగర్వాల్ బ్యాంక్ ఖాతానూ ఆరా తీస్తున్నారు. మొదట అక్రమ ఆస్తుల కేసును నమోదు చేసి తరువాత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. ఐటీ అధికారులు ఈ నగదు, నగల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి అందించారు. సహకార నగరలోని 5 ఎకరాల భూమి విలువను 250 కోట్లగా లెక్కించారు. తెరవెనుక ఉన్నవారెరు? ఈ సంపదపై ప్రభావం చూపుతున్న ఇద్దరు మంత్రులు, బళ్లారి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు అనేదానిపై పలు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. అవినాశ్ బెంగళూరులో ఇంకా ఎన్ని క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుని అక్కడ లాకర్లను తెరిచి నగలు, నగదును దాచారోనని ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. బౌరింగ్ టెన్నిస్ కోర్ట్లోనే ఇంత డబ్బులుంటే ఇతర ప్రాంతాలలో ఆయన సంపద అధికంగా ఉంటుందని అనుమానిస్తున్నారు. -
విద్యుత్ కార్యాలయంలో భారీ చోరీ
తూప్రాన్: డివిజన్ కేంద్రంలోని పోతరాజ్‌పల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ డీఈ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, విద్యుత్ డీఈ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్ పరిధిలోని గ్రామాల్లో వసూలు చేసిన కరెంట్ బిల్లుల నగదు రూ.16.39 లక్షలను రెండు బ్యాగుల్లో ఉంచి కార్యాలయంలోని లాకర్లో శనివారం రాత్రి భద్రపరిచారు. కార్యాలయం ప్రధాన గేటు తాళాన్ని, లాకర్లను దొంగలు గుణపం సహాయంతో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కార్యాలయంలోని పై అంతస్తులో నిద్రిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించినట్లు డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. -
యాచకుడు కాదు.. కోటీశ్వరుడు!
టీ.నగర్(చెన్నై): మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యాపారవేత్త ఆధార్ కార్డు సాయంతో కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీలోని రాల్పూర్‌లో డిసెంబర్ 13న భిక్షాటన చేసుకుంటున్న ఓ యాచకుడ్ని గుర్తించిన స్వామి భాస్కర్ స్వరూప్‌జీ అతడికి ఆశ్రయం కల్పించి ఆహారం అందజేశారు. తొలుత జుత్తు కత్తిరించి సదరు యాచకుడికి స్నానం చేయించబోగా అతనివద్ద ఆధార్ కార్డుతో పాటు రూ.1.06 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు, లాకర్ తాళం బయటపడ్డాయి. ముత్తయ్య నాడార్ పేరుతో ఉన్న ఆధార్ సాయంతో ఆయన కుటుంబ సభ్యుల్ని స్వరూప్‌జీ సంప్రదించారు. దీంతో నాడార్ తమిళనాడులోని తిరునెల్వేలిలో పెద్ద వ్యాపారవేత్తని తేలింది. సమాచారం అందుకున్న నాడార్ కుమార్తె గీత ఆయన్ను తీసుకెళ్లేందుకు రాల్పూర్‌కు చేరుకున్నారు. ఆరు నెలల క్రితం రైల్లో వెళ్తుండగా నాడార్ తప్పిపోయినట్లు గీత తెలిపారు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించడంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారన్నారు. తన తండ్రికి ఆశ్రయం కల్పించినందుకు స్వామి భాస్కర్‌కు గీత కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ చీఫ్ ఇంజనీర్ లాకర్లను ఓపెన్ చేసిన ఏసీబీ
-
తాళం వేసిన ఇంట్లో చోరీ
లక్ష నగదు అపహరణ కామారెడ్డి రూరల్ : మండలంలోని దేవునిపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిర్యాల్కర్ గణేశ్ సోమవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగుల గొట్టి ఇంట్లో బీరువాను పగులగొట్టి లక్ష రూపాయలను దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డట్లు గుర్తించారు. దీంతో గణేశ్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి దొంగల వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ బుధవారం తెలిపారు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
బొలేరో వాహనంలో వచ్చి.. లాకర్‌ను పగులగొట్టిన దొంగలు వరంగల్ జిల్లా జనగామలో ఘటన జనగామ: వరంగల్ జిల్లా జనగామలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. మహారాష్ట్ర పాసింగ్‌తో ఉన్న బొలేరో వాహనంలో వచ్చిన ఇద్దరు ముసుగు దొంగల అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడ్డారు. ముఖానికి ముసుగు ధరించి ఉన్నారు. ఏటీఎం గదిలో ఎడమవైపు ఉన్న సీసీ కెమెరా పనిచేయకుండా చేశారు. మిషన్‌కు అనుసంధా నం చేసిన వైరింగ్‌ను కట్ చేసే సమయంలో డేంజర్ హారన్ మోగడంతో వెంటనే దానిని పనిచేయకుండా ఆపేశారు. ఈ సమయంలో పోలీసు రక్షక్ వాహనం పెట్రోలింగ్ చేస్తూ అక్కడకు వచ్చింది. అప్పటికే దొంగలు ఏటీఎంను పక్కకు జరిపి, గ్యాస్కట్టర్లతో లాకర్ పైకప్పును పగులగొట్టారు. నగదును భద్రపరిచిన లాకర్‌ను తీసే సమయంలో పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఏటీఎం ఎదురుగా అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని చూసిన కాని స్టేబుల్ లక్ష్మారెడ్డి, సారంగపాణి అప్రమత్తమ య్యేలోపే దొంగలు వాహనంలో నల్లగొండ జిల్లా ఆలేరు వైపు పారిపోయారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఏటీఎం చోరీ విఫలయత్నంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సీఐ శ్రీని వాస్ నేతృత్వంలో వేలిముద్రల నిపుణులు రంగంలోకి దిగారు. దొంగల ఆనవాళ్ల కోసం ఆధారాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. 23వ తేదీన హోలీ రావడంతో బ్యాంకుకు సెలవు ప్రకటించామని, మరుసటి రోజు విధులకు వచ్చే వరకు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగినట్లు తెలుసుకున్నామని బ్యాంకు మేనేజర్ సుబ్రమణ్యగుప్త పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 11.47 గంట లకు లోనికి చొరబడ్డ దొంగలు 12.02 గంట లకు కట్టర్లతో పగులగొట్టారని పేర్కొన్నారు. ఏటీఎంలోని నగదు చోరీకాలేదన్నారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని పోలీసుకంట్రోల్ రూం, బ్యాంకు సీసీ పుటేజీల్లో నమోదైన రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. మద్దూరు మండలం మరుమాముల-సలాక్పూర్ మధ్య లో గురువారం దొరికిన గ్యాస్ కట్టర్లు జనగామ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసినవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. -
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
బ్యాంకు లాకర్ గదికి కన్నం స్థానికుల అప్రమత్తతో దుండగుల పరారీ మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఇద్దరు దుండగులు గేట్ ద్వారా లోనికి ప్రవేశించి లాకర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. గొడ్డలి, స్క్రూడ్రైవర్, బ్లేడ్, గునపం, పోకర్‌తో లాకర్ గదికి రంధ్రం చేశారు. మధ్యలో లాకర్ గదికి ఉన్న ఆర్సీసీ(సిమెంటు కాంక్రిట్ లేయర్) అడ్డు తగిలింది. దానిని పగులగొట్టే క్రమంలో శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు మేల్కోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు లైట్లు వేయడంతో దుండగులు పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ వి.సురేశ్, ఎస్సైలు ఎస్కే.లతీఫ్, ఎం.వెంకటేశ్వర్లు పరిశీలించారు. దుండగులు సంఘటన స్థలంలో సారా తాగినట్లు అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్యాంకు సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి. పోలీసు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. -
డి ఫర్ దోపిడీ..
బ్యాంకులో దోపిడీకి ప్లాన్.. ఇందుకోసం బ్యాంకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న భవనం నుంచి బ్యాంకు లోపలికి 125 అడుగుల మేర సొరంగం తవ్వడం.. దాంట్లోంచి వెళ్లి బ్యాంకులోని నగదును, లాకర్లను కొల్లగొట్టడం.. వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా.. హర్యానాలోని గొహానా పట్టణంలో ఇది నిజంగానే జరిగింది. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మొత్తం 350 లాకర్లు ఉండగా.. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి అందులో 89 లాకర్లను తెరిచి.. రూ.కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టుకుపోయారు. దానికి సంబంధించిన చిత్రాలే ఇవి.. 7 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పులో ఈ సొరంగాన్ని తవ్వారు. వారాంతపు సెలవుల అనంతరం సోమవారం బ్యాంకును తెరిచినప్పుడు ఈ విషయం బయటపడింది. శనివారం లేదా ఆదివారం రాత్రి దోపిడీ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, తమ విలువైన సొత్తును భద్రపరచడంలో బ్యాంకు నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ.. ఖాతాదారులు బ్యాంకుపై కేసు వేయాలని యోచిస్తున్నారు. -
నాగమణి కలకలం!
ఎమ్మిగనూరు టు మలేషియా వయా కర్ణాటక ఎమ్మిగనూరు: నాగ‘మణి’ కర్ణాటక రాష్ట్రంలోని ఓ లాకర్లో ఉంది. కోట్లాది రూపాయల విలువ చేస్తుంది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే ఆ లాకర్‌ను తెరవగలడు. అతనికి రూ.8 కోట్లు ముట్టుజెబితే మణి సొంతమవుతుంది. అప్పుడు కోట్లకు పడగలెత్తొచ్చు. మణిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే చాలా మంది ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని పలువురు వ్యాపారులను నిలువునా ముంచింది. అత్యాశకు పోయిన వీరంతా ఇళ్లను అమ్ముకొని.. వ్యాపారాలను తాకట్టుపెట్టి ఉందో లేదో తెలియని మణి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, సోమేశ్వర సర్కిల్లో మిఠాయి వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తి నాగ‘మణి’ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇటీవల గాంధీనగర్‌లో ఇల్లు కట్టుకున్న ఓ డాక్యుమెంట్ రైటర్ అతని మాయలో పడి దాన్ని రూ.45లక్షలకు విక్రయించి వారి చేతిలో పెట్టేశాడు. సోమప్ప సర్కిల్లో బట్టల వ్యాపారం చేస్తున్న ఓ శెట్టి ఏకంగా ఆరు నెలల్లోనే రూ.2 కోట్లకు పైగా అప్పు చేసి వారికి ముట్టజెప్పాడు. మరో బట్టల వ్యాపారి రూ.1.5 కోట్లు.. సెల్ షాపు నిర్వాహకుడు రూ.30 లక్షలు.. ఫర్నిచర్ దుకాణం యజమాని.. అందరూ కలసి మొత్తం రూ.8 కోట్లకు పైగా నగదు మణి మాయలో పడి చేజార్చుకున్నారు. ప్రస్తుతం వీరంతా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. వీరి నుంచి వసూలు చేసిన రూ.8 కోట్లు మలేషియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని.. అతను వచ్చి కర్ణాటకలోని లాకర్ తెరిస్తే నాగ‘మణి’ని సొంతం చేసుకోవచ్చని ఇప్పటికీ ఆ ఇరువురు వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. వీరు ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు మలేషియా వెళ్లొచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరి లేని మణి వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో.. వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఏమి చేశారో.. తిరిగి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతింటిని పోగొట్టుకున్న డాక్యుమెంట్ రైటర్ సోదరులు ఇద్దరు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. వీరు తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకొని అగ్రహారం ఏజెంట్‌ను ఇటీవల దబాయించగా జూలై 15లోగా రూ.50లక్షలు తిరిగిచ్చేస్తామని.. అప్పటి వరకు ఎస్పీ దృష్టికి తీసుకుపోవద్దని వేడుకున్నట్లు సమాచారం. -
లాకర్ తీసుకుందామా...
రమేష్ చాలా జాగ్రత్తపరుడు. ఆర్థిక విషయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. ఇలా ఉండగా.. ఒకసారి దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో రమేష్ కుటుంబం మొత్తం వెళ్లాల్సి వచ్చింది. ఇంటికీ, బీరువాలకు తాళాలు గట్రా అన్ని పకడ్బందీగానే వేసుకుని వెళ్ళారు. ఫంక్షన్ చూసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో గాభరాపడుతూ లోపలికెళ్లారంతా. తీరా చూస్తే బీరువాలో దాచుకున్న బంగారు నగలు, కొంత డబ్బు అంతా కూడా దొంగలు దోచుకెళ్లారని అర్థమవడంతో గొల్లుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చోరీ అయినవి చేతికి ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి ఉదంతాలు.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇలా దోపిడీ దొంగల భయం పెరిగిపోతున్న నేపథ్యంలో కాస్త మెరుగైన భద్రతను అందించే బ్యాంకు లాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. కొండొకచో బ్యాంకులకు కూడా దొంగతనాల బెడద ఎదుర్కొంటున్నప్పటికీ.. విలువైన వాటిని భద్రంగా దాచుకునేందుకు ఇంటితో పోలిస్తే బ్యాంకు లాకర్లే కొంత సురక్షితమైనవిగా ఉంటున్నాయి. అందుకే వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటి ప్రాధాన్యత గుర్తించే ఆంధ్రా బ్యాంకు లాంటివి ప్రత్యేకంగా లాకర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లే.. విలువైన ఆభరణాలు, వస్తువులు, కీలకమైన పత్రాలు మొదలైన వాటిని దాచుకునేందుకు బ్యాంకులు లాకర్లను అద్దెకి ఇస్తుంటాయి. వీటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా లేదా సంస్థల పేరు మీద కూడా తీసుకోవచ్చు. డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం బ్యాంకు లాకర్లు పొందడమన్నది కష్టసాధ్యంగా మారింది. చాలా బ్యాంకుల్లో వెయిటింగ్ లిస్టు ఉంటోంది. ఇందులోనూ మళ్లీ ప్రొఫైల్‌ని బట్టి కీలకమైన ఖాతాదారులకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. లాకరు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖలో ఖాతా కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే నిర్దిష్ట మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా బ్యాంకులు అడుగుతున్నాయి. లాకరు తీసుకునేటప్పుడు జాయింట్‌గా గానీ లేదా నామినేషన్ పద్ధతిలో గానీ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినా.. లాకర్లలో ఉన్నవి వారసులకు చేరడంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా ప్రతి లాకరుకు తాళం చెవులు రెండు ఉంటాయి. ఒకటి బ్యాంకు దగ్గర, రెండోది లాకరు అద్దెకు తీసుకున్న వారి దగ్గర ఉంటుంది. ఈ రెండింటినీ ఉపయోగిస్తేనే లాకరు తెరుచుకుంటుంది. తాళం చెవిని పోగొట్టుకున్నారంటే .. మొత్తం తాళాన్నే మార్చాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చునంతా కూడా భరించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 12 సార్ల దాకా లాకరును తెరిచి చూసుకునేందుకు ఉచితంగా అనుమతిస్తున్నాయి. ఎస్బీఐలో అయితే.. 12 సార్లకు మించితే వెళ్లిన ప్రతిసారీ రూ. 51 కట్టాల్సి ఉంటుంది. ఒక్కసారైనా.. లాకర్ తీసుకున్న తర్వాత కనీసం ఏడాదికోసారైనా బ్యాంకుకు వెళ్లి, లాకరును తెరిచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాది గడిచినా అలా చేయకపోతే ఆ లాకర్‌ను రద్దు చేసే అధికారం బ్యాంకులకు ఉంది. అయితే, నేరుగా రద్దు చేసే అధికారం లేదు. ముందుగా ఒక సంవత్సరం నుంచి మీ లాకర్లో లావాదేవీలు జరగటం లేదు కాబట్టి రద్దు చేయాలనుకుంటున్నామంటూ ఖాతాదారుకు సమాచారం అందించాలి. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే వారసులకు తెలపాలి. వీరెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆ అకౌంట్‌ను పరిచయం చేసిన వ్యక్తి ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ విఫలమైతే వాడకంలో లేని అకౌంట్‌గా పరిగణించి ప్రత్యేక లెడ్జర్‌ను తయారు చేయడం ద్వారా ఆ లాకర్‌ను రద్దు చేసి వేరే వారికి ఇవ్వొచ్చు. ఇలా చేయకుండా సకాలంలో అద్దె చెల్లించలేదనో, లేక మొక్కుబడిగా సమాచారం అందించో, లాకర్‌ను రద్దు చేసిన అనేక సందర్భాల్లో వినియోగదారుల ఫోరంలో ఖాతాదారులదే పై చేయి అయ్యింది. వివిధ పరిమాణాలు.. చిన్నవి, మధ్యస్థాయి, పెద్దవి, అతి పెద్దవంటూ లాకర్లు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. సాధారణంగా 864 ఘనపు అంగుళాల నుంచి 3,456 ఘనపు అంగుళాల దాకా వివిధ సైజుల్లో ఇవి లభిస్తాయి. లాకర్ల పరిమాణం, బ్యాంకు శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి అద్దెలు మారుతుంటాయి. పెద్ద నగరాల్లో ఎక్కువగాను.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాయిలు కాస్త తక్కువగాను ఉంటాయి. అద్దెలు..వ్యయాలు.. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) చిన్న సైజు లాకరుకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె ఏడాదికి రూ. 764 కాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 1,019గా ఉంది. లాకరు సైజు, ప్రాంతాన్ని బట్టి కిరాయి గరిష్టంగా రూ. 5,093 దాకా ఉంది. అదే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. వార్షికంగా రెంట్ రూ. 1,250 నుంచి రూ. 10,000 దాకా (లాకర్ సైజు, ప్రాంతాన్ని బట్టి) ఉంది. సిటీ బ్యాంకు లాంటి వాటిల్లో గరిష్టంగా రూ. 40,000 దాకా కూడా అద్దె ఉంది. ఇవే కాకుండా.. తాళం చెవి గానీ పోగొట్టుకుంటే .. కొత్త తాళం చెవిని ఇచ్చేందుకు కూడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. కొన్నింటిలో ఇది రూ. 500పైచిలుకు ఉంది. ఇక అద్దె గానీ బకాయి పడితే.. వార్షిక కిరాయిలో పది శాతం నుంచి 50 శాతం దాకా చార్జీలు విధిస్తోంది (బకాయి పడిన కాలానికి) ఎస్బీఐ. మరోవైపు, లక్షల రూపాయల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తేనో లేదా బీమా పథకాల్లాంటివి కొంటేనో మాత్రమే లాకర్లు ఇస్తామంటూ షరతులు పెడుతుంటాయి బ్యాంకులు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఖాతాదారు లాకరుని ఉపయోగించకుండా, అద్దె కట్టకుండా వదిలేస్తే.. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి బకాయిలను జమ చేసుకోవడం దీని వెనుక ముఖ్యోద్దేశం. అయితే, లక్షల రూపాయల్లో ఎఫ్డీలో లేదా బీమా పథకాలో తీసుకోవాలన్నది కచ్చితం కాదంటోంది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొత్తగా లాకర్ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దె, బ్రేకింగ్ చార్జీలు మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందస్తుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ. 1,200 అద్దె అనుకుంటే.. బ్రేకింగ్ చార్జీలు రూ. 100 అనుకుంటే.. మూడేళ్లకు సంబంధించి బ్యాంకులు రూ. 3,700 దాకా బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవచ్చు. భద్రత .. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు సాధారణంగానే పటిష్టమైన లాకర్లు, అలారం సిస్టమ్, సీసీటీవీలు, గార్డులు వంటి గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తాయి. అయితే, కొన్ని సార్లు ఇంతటి భద్రత వ్యవస్థ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల బారిన కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పరిహారాల్లాంటివి చెల్లించడం తమ బాధ్యత కాదంటున్నాయి బ్యాంకులు. మనం లాకర్లలో ఏం దాచుకున్నదీ, వాటి విలువ ఎంత ఉంటుందనేది కూడా తమకు తెలియదు కాబట్టి వాటిలోవి పోతే అందుకు తమది పూచీ ఉండదన్నది వాటి వాదన. ఇలాంటప్పుడు బ్యాంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని నిరూపిస్తే తప్ప పరిహారాల కోసం పోరాడటం కుదరదు. అయితే, ఇలాంటి కొన్ని కేసుల్లో ఖాతాదారులు విజయం సాధించిన సందర్భాలు, నష్టపరిహారం దక్కించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి కనుక.. ఆ మేరకు లాకర్లను సురక్షితమైనవిగానే పరిగణించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాకరు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవాలి. లాకరులో ఏమేమి ఉంచుతున్నారో రాసి పెట్టుకోవాలి. వీలైతే ఫొటో కాపీలు తీసి ఉంచుకుంటే మరీ మంచిది. ఒకవేళ అనూహ్యమైన ఘటన ఏదైనా జరిగినా.. డిమాండ్ చేయాల్సిన పరిహారం గురించి ఒక అవగాహన ఉంటుంది. లాకరు తెరిచి, మూసిన ప్రతిసారి తాళం సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి.