ఏటీఎం చోరీకి విఫలయత్నం
బొలేరో వాహనంలో వచ్చి.. లాకర్‌ను పగులగొట్టిన దొంగలు
వరంగల్ జిల్లా జనగామలో ఘటన
జనగామ: వరంగల్ జిల్లా జనగామలోని హైదరాబాద్ రోడ్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. మహారాష్ట్ర పాసింగ్‌తో ఉన్న బొలేరో వాహనంలో వచ్చిన ఇద్దరు ముసుగు దొంగల అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడ్డారు. ముఖానికి ముసుగు ధరించి ఉన్నారు. ఏటీఎం గదిలో ఎడమవైపు ఉన్న సీసీ కెమెరా పనిచేయకుండా చేశారు. మిషన్‌కు అనుసంధా నం చేసిన వైరింగ్‌ను కట్ చేసే సమయంలో డేంజర్ హారన్ మోగడంతో వెంటనే దానిని పనిచేయకుండా ఆపేశారు. ఈ సమయంలో పోలీసు రక్షక్ వాహనం పెట్రోలింగ్ చేస్తూ అక్కడకు వచ్చింది. అప్పటికే దొంగలు ఏటీఎంను పక్కకు జరిపి, గ్యాస్‌కట్టర్లతో లాకర్ పైకప్పును పగులగొట్టారు. నగదును భద్రపరిచిన లాకర్‌ను తీసే సమయంలో పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఏటీఎం ఎదురుగా అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని చూసిన కాని స్టేబుల్ లక్ష్మారెడ్డి, సారంగపాణి అప్రమత్తమ య్యేలోపే దొంగలు వాహనంలో నల్లగొండ జిల్లా ఆలేరు వైపు పారిపోయారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఏటీఎం చోరీ విఫలయత్నంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సీఐ శ్రీని వాస్ నేతృత్వంలో వేలిముద్రల నిపుణులు రంగంలోకి దిగారు. దొంగల ఆనవాళ్ల కోసం ఆధారాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. 23వ తేదీన హోలీ రావడంతో బ్యాంకుకు సెలవు ప్రకటించామని, మరుసటి రోజు విధులకు వచ్చే వరకు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగినట్లు తెలుసుకున్నామని బ్యాంకు మేనేజర్ సుబ్రమణ్యగుప్త పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 11.47 గంట లకు లోనికి చొరబడ్డ దొంగలు 12.02 గంట లకు కట్టర్లతో పగులగొట్టారని పేర్కొన్నారు. ఏటీఎంలోని నగదు చోరీకాలేదన్నారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని పోలీసుకంట్రోల్ రూం, బ్యాంకు సీసీ పుటేజీల్లో నమోదైన రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. మద్దూరు మండలం మరుమాముల-సలాక్‌పూర్ మధ్య లో గురువారం దొరికిన గ్యాస్ కట్టర్లు జనగామ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసినవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు.