
ఏం షాకిచ్చాడో!
బిచ్చగాడు: అమ్మా... బిచ్చం వేయండమ్మా... సూర్యకాంతం: చేతులు ఖాళీ లేవు... బిచ్చగాడు: అలా అనకండమ్మా... ఒక్కసారి వెయ్యండి.
బిచ్చగాడు: అమ్మా... బిచ్చం వేయండమ్మా... సూర్యకాంతం: చేతులు ఖాళీ లేవు... బిచ్చగాడు: అలా అనకండమ్మా... ఒక్కసారి వెయ్యండి. మళ్లీ మూడు నెలల దాకా కనిపించను. సూర్యకాంతం: అదేంటి... ఎక్కడికి పోతావ్? బిచ్చగాడు: ఎండాకాలం వస్తోంది కదమ్మా... ఈ మూడు నెలలూ కొడెకైనాల్ వెళ్లి అడుక్కుంటా! పీడకల
పంకజం: ఈ మధ్య బాగా పీడకలలు వస్తున్నాయి డాక్టర్! డాక్టర్: అంటే ఎలాంటి కలలు వస్తున్నాయి?
పంకజం: నేను వంట చేస్తున్నట్టు, మావారు ‘ఏమే, వంటయ్యిందా’ అని కేకలు పెడుతున్నట్టు వస్తున్నాయి!