
సాక్షి, ఆర్మూర్: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారులో ఆర్మూర్ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్ లేవని బదులిచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు.
కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ వెల్లడించారు.
బిక్షం అడిగితే కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2024
ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు.
శివరాం డబ్బుల… pic.twitter.com/NQIi59uLYb
Video Credits: Telugu Scribe