armour
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
కాలితో తన్నిన ఆఫీసర్.. యాచకుడి దుర్మరణం
సాక్షి, ఆర్మూర్: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారులో ఆర్మూర్ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్ లేవని బదులిచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ వెల్లడించారు. బిక్షం అడిగితే కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు. శివరాం డబ్బుల… pic.twitter.com/NQIi59uLYb — Telugu Scribe (@TeluguScribe) February 24, 2024 Video Credits: Telugu Scribe -
ఆర్మూర్ బరిలో రేవంత్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా పార్టీ బలం, బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, అదేవిధంగా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనుండడంతో పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహం పెల్లుబికుతోంది. దక్షిణ తెలంగాణ విషయమై పార్టీ అధినాయకత్వం పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పార్టీ పూరించింది. తదుపరి టాస్‌్కలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్.. రేవంత్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే విషయమై జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ అంశం తిరుగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ నేపథ్యంలో రైతుల్లో పారీ్టపై అనుకూలత పెరిగింది. ధరణి రద్దు చేస్తామని ప్రకటనతో కాంగ్రెస్‌కు మరింత మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వ్యవసాయపరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ నుంచి రేవంత్‌ను పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం కోసమే..! కర్ణాటక విజయం తరువాత తెలంగాణను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇక్కడి వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు ఉండడంతో ఉత్తర తెలంగాణలో సైతం ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రజాదరణ ఉన్న రేవంత్‌రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వే బృందం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ఆర్మూర్ నుంచి బరిలో ఉంటే ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ని 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ డీసీసీ నాయకత్వం రేవంత్‌ను బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా వ్యవహారం ముందుకు పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ నేతలు ఆర్మూర్ నుంచి రేవంత్‌ను బరిలో దించేందుకు ఆలోచిస్తుండడం విశేషం. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్ విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
తాలిబన్లకు మరో షాకిచ్చిన అగ్రరాజ్యం
వాషింగ్టన్: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరో షాకిచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆ దేశానికి ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు సమాచారం అందించింది. కాగా, ఆఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనం తరువాత అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడిచి రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకుందని అగ్రరాజ్యం గర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తాలిబన్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బైడెన్ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అమెరికా ఆయుధ భాండాగారంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, మైన్ రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు ఎం4 కార్బైన్లు, ఎం 6 రైఫిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 2020 వరకు అమెరికా అఫ్గాన్‌కు 227 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. చదవండి: ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. ఒక్క రోజులో వెయ్యికి పైగా మరణాలు -
కాంగ్రెస్‌లో గందరగోళం
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. విప్ ధిక్కరించి చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి సహకరించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ విషయమై ఎటూ తేల్చకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. కౌన్సిలర్లు ఖాందేశ్ సంగీత, జాగిర్దార్ ఆకుల లత, పండిత్ ప్రేమ్, కోగుల పూల నర్సయ్య ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు గైర్హాజరైన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగింది. విప్ ధిక్కరించి కాంగ్రెస్ ఓటమి కి కారణమైన ఆ నలుగురు కౌన్సెలర్లతో పాటు మహిళా కౌన్సిలర్ల భర్తలు పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, జాగిర్దార్ శ్రీనివాస్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని, కౌన్సెలర్లపై అనర్హత వేటు వేయించాలని పార్టీ నాయకులు డీసీసీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలంగాణ పీసీసీకి లేఖ రా శారు. ఈ లేఖను సరిగా చదవని ఆర్మూ ర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సదరు నేతలను పార్టీనుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. లేఖను చదివినవారు అవి సస్పెన్షన్ ఆదేశాలు కావని పేర్కొనడంతో పట్టణ కాంగ్రెస్ నాయకులు అవాక్కయ్యారు. వెంటనే డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి సహకరించిన ఆరుగురు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. విప్ ధిక్కరించిన వారిని ఉపేక్షిస్తే భవిష్యత్‌లో ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఉండదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలకు నీళ్లు ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలకు నీళ్లు వదిలి ప్రతి కాంగ్రెస్ అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేశారని పార్టీ మండల అధ్యక్షుడు పీసీ భోజన్న పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. నలుగురు కాంగ్రెస్ కౌన్సెల ర్లు డబ్బులకు అమ్ముడు పోయి టీఆర్ఎస్కు అండగా నిలిచారని ఆయన ఆరోపించారు. అదే ఆవేశంలో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ఖర్చుల కోసం ప్రతి అభ్యర్థికి రూ. 3 లక్షలు ఇచ్చిం దని, వాటిని ఆ నలుగురు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి రేసులో ఉన్న శ్రీదేవి భర్త శ్రీనివాస్ నుంచి కౌన్సిలర్లు తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, పండిత్ ప్రేమ్‌లు ఫోన్లో స్పందించారు. తాము పార్టీ ఫండ్ తీసుకోలేదన్నారు. -
ఎవరి ఆశలు నెగ్గెనో..!
అసెంబ్లీ నియోజకవర్గం ఆర్మూర్ ఎవరెన్నిసార్లు గెలిచారు: సోషలిస్టు పార్టీ- 1, కాంగ్రెస్ - 8 టీడీపీ - 3, టీఆర్ఎస్ -1 ప్రస్తుత ఎమ్మెల్యే: ఏలేటి అన్నపూర్ణ (టీడీపీ) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం ఎక్కువ. మైనార్టీలు, బీసీల ఓట్లు అధికం ప్రస్తుతం బరిలో నిలిచింది: 11 ప్రధాన అభ్యర్థులు వీరే.. కె.ఆర్ సురేష్‌రెడ్డి (కాంగ్రెస్) ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టీఆర్ఎస్) షేక్ మహబూబ్ (వైఎస్సార్ కాంగ్రెస్) రాజారాం యాదవ్ (టీడీపీ) గత వైభవం కోసం మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి, విశ్వసనీయతను నిరూపించుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్, సత్తా చాటడం కోసం టీఆర్ఎస్, ఉనికిని కాపాడుకోవడానికి టీడీపీ.... ఇలా ఆర్మూర్‌లో హేమాహేమీలు తలపడుతున్నారు...బీసీ, మైనార్టీ ఓటర్లు అధికంగా గల ఈ సెగ్మెంట్లో పోటీ హోరాహోరీ సాగే అవకాశం ఉంది. (కొండవీటి సురేష్ కుమార్, ఆర్మూర్ ) రాష్ట్ర రాజకీయాల్లో ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆర్మూర్ కేంద్రంగా రాజకీయాలు నిర్వహించిన నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించారు. ప్రస్తుతం ఇక్కడ 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే ప్రధానంగా పోరు నెలకొంది. ఓడిన చోటే సత్తా చాటాలని.... నాలుగుసార్లు వరుసగా గెలుపొందిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో ఆర్మూ ర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిని పట్టించు కోకపోవడం ఆయనకు ప్రతికూల అంశంగా మారింది. తొలి అభ్యర్థి..తొలి విజయం కోసం... ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఏడాది క్రితమే టీఆర్ఎస్ ఆర్మూరు నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి విజయం కూడా తనదే కావాలన్న లక్ష్యంతో జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్తో కలిసి రావాలని తెలంగాణ వాదులను కోరుతున్నారు. విశ్వసనీయతకు పట్టం కట్టాలి.. వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి షేక్ మహబూబ్ ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతూ ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబాన్ని ఆదరించాలని కోరుతున్నారు. ఉనికి కోసం టీడీపీ.... టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఏలేటి అన్నపూర్ణ పోటీ నుంచి తప్పుకొని తన తనయుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి బాల్కొండ నుంచి టీడీపీ టికెట్ సాధించుకొంది. దీంతో బాల్కొండ నుంచి బీసీకి టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకొన్న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్‌కు ఆర్మూర్ టికెట్ కేటాయించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం తప్ప ఆర్మూర్ నియోజకవర్గంలోని రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని రాజారాం యాదవ్ ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులపై ఆధారపడి టీడీపీ గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీకి ప్రతికూల పరిస్థితులే అని తెలిసినా టీడీపీ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా రాజారాం యాదవ్ ముందుకు వెళ్తున్నారు. ఆర్మూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతా విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తా. - కేఆర్ సురేశ్‌రెడ్డి ముంపు బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తా ఉచిత విద్యుత్ కొనసాగిస్తా నందిపేటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తా ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని అభి వృద్ధి చేస్తా. -షేక్ మహబూబ్ ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇప్పిస్తా లక్కంపల్లి సెజ్ భూములను రైతులకు తిరిగి అప్పగించేలా చూస్తాను తాగునీటి పరిష్కారానికి శాశ్వత పరిష్కారమైన ఎత్తిపోతలను పూర్తి చేయిస్తా -ఆశన్నగారి జీవన్‌రెడ్డి పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు కృషి గల్ఫ్, బీడీకార్మికుల సమస్యలను పరిష్కరిస్తా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగు, సాగునీరందేలా పథకాలు అమలుచేయిస్తా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటుకుచర్యలు తీసుకుంటా -రాజారాం యాదవ్