
సాక్షి, చాదర్‌ఘాట్: రహదారికి ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పైనే నవజాత శిశువుతో కలిసి ఓ యాచకురాలు ఆవాసం ఏర్పరుచుకుంది. చాదర్‌ఘాట్ రహదారి పక్కన ఆ అభాగ్యరాలి దీనస్థితిని గమనించిన ఓ నెటిజన్ వారి ఫొటో తీసి ఆమెకు తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తన పెద్దమనసు చాటుకున్నారు.
Request @ZC_Charminar to immediately shift them to the nearest night shelter https://t.co/hrIZHxKwOK
— KTR (@KTRTRS) October 7, 2021
నెటిజన్ పెట్టిన చంటిబిడ్డతో కూడిన ఫొటోను చార్మినార్ జోనల్ కమిషనర్‌కు పంపుతూ వెంటనే వారిని సమీప నైట్‌షెల్టర్‌కు తరలించాలని సూచించారు. అభాగ్యురాలి దీనస్థితిపై వెంటనే స్పందించిన కేటీఆర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు.