అనంతపురం సెంట్రల్ : నగరంలో మొదటిరోడ్డు శివారులో జీరో క్రాసింగ్‌వద్ద ఆదివారం రాత్రి రోడ్డు పక్కన పడుకున్న యాచకుని తలపై గుర్తు తెలియని వాహనం ఎక్కిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు కృష్ణారెడ్డి ద్వారా యాచకునికి అంత్యక్రియలు జరిపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.