రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి | ysrcp activist killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

Published Mon, Apr 10 2017 11:14 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

ysrcp activist killed in road accident

విడపనకల్లు(ఉరవకొండ):

విడపనకల్లు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం మళాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మోహన్‌కృష్ణ(35) మరణించినట్లు ఎస్‌ఐ రత్నం తెలిపారు. విడపనకల్లు నుంచి బైక్‌లో కర్ణాటకలోని బళ్లారికి బయలుదేరగా.. మార్గమధ్యంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపానికి రాగానే చేళ్లగురికి నుంచి విడపనకల్లు వైపునకు ఎదురొచ్చిన మరో బైక్‌ ఢీకొనడంతో మోహన్‌కృష్ణ తలకు బలమైన గాయమైందని, ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య మాధురి, కొడుకు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మళాపురానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి సంతాపం తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, తదితరులు ఉన్నారు. ఉరవకొండ ఆస్పత్రి మార్చురీలోని మోహన్‌కృష్ణ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement