
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయభాస్కర్ రెడ్డి హత్యకేసు ప్రధాన సాక్షులపై హత్యకు కుట్ర జరిగింది. తమను హత్య చేసేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కుట్ర చేశారని ఆరోపిస్తూ అప్పేచర్లకు చెందిన గరుడ శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జేసీ వర్గీయులు వెంకటేశ్వర్లు, నెల్లూరు నాయుడు, మహబూబ్ బాషాలపై గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితులు గుర్రంశీనా, వెంకటేశ్వర్లు, గురుప్రసాద్‌లకు గుత్తి కోర్టు ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. జేసీ అండతో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment