
సంఘటనా స్థలంలోనే మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉప్పర నరసింహప్ప
పెనుకొండ రూరల్: మండలంలోని మావటూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉప్పర నరసింహప్ప(27) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు, టీడీపీ కార్యకర్తలు ఖాజావలి, జబ్బార్, నాగ, క్రిష్టప్పకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉప్పర నరసింహప్ప(27)కు గురువారం రాత్రి గ్రామంలోని హోటల్ సమీపంలో ఓ చిన్న పాటి ఘర్షణ జరిగింది. అనంతరం ఇంటికి వెళుతున్న ఉప్పర నరసింహప్పని వారు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం నిందితులు పరారయ్యారు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మావటూరు సర్పంచ్ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సిద్దయ్య తెలిపారు.