
సాక్షి, అనంతపురం: జిల్లాలోని డి. హీరేహాళ్‌లో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. వృద్ధ దంపతులను కన్న కొడుకే హత్య చేసినట్లు విచారణలో తేలడంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్‌లో బసవరాజు, లక్షిదేవి అనే వృద్ధ దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో వారి హత్యపై అనుమానాలు ఉన్నాయంటూ కొడుకు అశోక్ బంధువులపై ఫిర్యాదు చేశారు. అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ వివాహానికి నిరాకరించారనే అక్కసుతో తల్లిదండ్రులను చంపినట్లు అశోక్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇక ఈ కేసులో అశోక్‌తో పాటు అతడి స్నేహితుడు జమ్మన్నలను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment