
బిచ్చగాడే కానీ... రిచ్‌గాడు!
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు భరత్ జైన్. వయసు 49 ఏళ్లు. ముంబై వీధుల్లో తిరుగుతూ యాచన సాగిస్తుంటాడు.
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు భరత్ జైన్. వయసు 49 ఏళ్లు. ముంబై వీధుల్లో తిరుగుతూ యాచన సాగిస్తుంటాడు. వృత్తిలో ఇతగాడిది దాదాపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఓస్..! యాచకుడేనా అని తీసిపారేయకండి. ఇతగాడి ఆస్తి వివరాలు, ఆదాయ వివరాలు తెలుసుకుంటే, మీ కళ్లు తిరగడం ఖాయం. ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఇతగాడికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. సర్కారు లెక్కల ప్రకారం వాటి విలువ రూ.80 లక్షలు. మార్కెట్ విలువ దానికి రెట్టింపు కంటే ఎక్కువే ఉంటుంది. ఈ రెండు ఫ్లాట్లపైనా అద్దె వస్తోంది. ఇవి కాకుండా, ఒక షాపును కూడా జ్యూస్ సెంటర్‌కు అద్దెకు ఇచ్చేశాడు. రోజూ ఏడెనిమిది గంటల సేపు రద్దీ కూడళ్లలో తిరుగుతూ యాచిస్తూ ఉంటాడు.
యాచన ద్వారా ఇతగాడికి రోజుకు కనీసం రెండు నుంచి మూడువేల రూపాయల వరకు కలెక్షన్ ఉంటుంది. ఇతగాడి కుటుంబం ముంబైలోనే వేరేచోట చిన్నపాటి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇతగాడి కుటుంబంలోని మిగిలిన సభ్యులందరూ స్కూళ్లకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్ సరఫరా చేసే వ్యాపారం సాగిస్తుంటే, ఇతగాడు మాత్రం ఇప్పటికీ తాను మొదటి నుంచి నమ్ముకున్న యాచననే కొనసాగిస్తుండటం విశేషం.