కర్నూలు: లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.