
మృతదేహాన్ని పరిశీలిస్తున్న కంగాటి శ్రీదేవి
డోన్ రూరల్ : వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్త క్రిష్ణమూర్తి ఆచారి (40) శనివారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి ఆచారి డోన్ పట్టణంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనకు భార్య సునితతోపాటు ఇద్దరు కుమారులున్నారు.
కంగాటి శ్రీదేవి పరమార్శ
క్రిష్ణమూర్తి ఆచారి మరణవార్త తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంగాటి శ్రీదేవి హుటాహుటిన ప్రజా వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని భార్య సునీతను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కంగాటి శ్రీదేవి వెంట పార్టీ పత్తికొండ నియోజకవర్గపు నాయకులు మాదవరావ్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment