ఏడుగురు అరెస్టు
ఏడుగురు అరెస్టు
Published Fri, Mar 24 2017 11:26 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
డోన్ టౌన్ : మున్సిపల్ వేలం పాటల సందర్భంగా శుక్రవారం ఉదయం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనలో 7గురిని అరెస్టు చేసినట్లు శుక్రవారం రాత్రి ఏఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. సీఐ కార్యాలయంలో విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచిన అనంతరం ఆయన డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌తో కలిసి మాట్లాడారు. పోస్టుప్రసాద్, రమణ, సుధాకర్, లాల్‌బాషా, మదన్‌లపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనతో సంబందం ఉన్న కొండపేట, చిగురుమానుపేటలకు చెందిన 7గురిని గుర్తించామన్నారు. నిందితులు చిన్నకాంత్ అలియాస్ శ్రీకాంత్, పెద్దకాంత్ అలియాస్ చంద్రకాంత్, దూదేకుల హుమయూన్, షేక్‌లాల్ బాషా, బుడ్డన్నగారి రమణ, గాజుల శ్రీకాంత్, పల్లెగాని చక్రపాణిగౌడ్‌లను దొరపల్లె బ్రిడ్జ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిని డోన్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ చిన్నికృష్ణ ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఘటనలో సుమారు 20 మంది పాల్గొన్నారని ఏఎస్పీ తెలిపారు. మున్సిపల్ వేలం పాటలో తమకు పోటీగా వేలం పాడేందుకు ధరావత్తు సొమ్ము చెల్లించారనే ఆగ్రహంతోనే నిందితులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు.
Advertisement