20 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
Published Sat, Mar 25 2017 10:28 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
డోన్ టౌన్: వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడి కేసులో మున్సిపల్ వైస్‌చైర్మన్ కేశన్నగౌడ్‌తో పాటు 19మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వేలంపాటకు అడ్డుపడుతున్నారనే కారణంతో వైఎస్‌ఆర్‌సీసీ వర్గీయులు పోస్టుప్రసాద్, గొల్లరమణ, మదన్, సుధాకర్, లాల్‌బాషాలపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడిచేసి హత్యాహత్యానికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కేశన్నగౌడ్, చక్రపాణిగౌడ్, టైలర్ చంద్ర, జగదీశ్, మద్దిలేటి, సుదర్శన్, రూపక్, వినోద్, పవన్, ఉమాయిన్, శ్రీకాంత్, నాగార్జున , హరినాథ్‌రెడ్డి , చిన్నకాంత్, పెద్దకాంత్, బుజ్జనగారి రమణ, షేక్ లాల్‌బాషాతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
అందరిపై రౌడీ షీట్ నమోదు
ఈ దాడికి పాల్పడిన 20 మందిపై రౌడీషీట్ నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు గౌడ్ పర్యవేక్షణలో ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. మిగిలిన 17మందిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై కూడా..
దాడి ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుప్రసాద్, గొల్ల మదన్, సుధాకర్, ఫరీ«ద్, కోట్రికె హరి తనను కులం పేరుతో దూషించారని టీడీపీకి చెందిన చిన్నకాంత్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశామన్నారు.
Advertisement