
డోన్: కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మున్సిపాలటీ టెండర్‌ల విషయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. టెండర్ వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. కార్యకర్త ప్రసాద్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


