పల్నాడు, ఏలూరు జిల్లాల్లో వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం
కర్నూలు జిల్లాలో వీఆర్వో కుటుంబంపై దాడి
సాక్షి నెట్‌వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంçÜం చేశారు. వీఆర్వో కుటుంబంపై దాడిచేశారు.
» పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని గ్రామ సచివాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని శనివారం రాత్రి విరగ్గొట్టారు. విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు కానాల పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోగుల అంజిబాబు, నేతలు చిమటా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, షేక్ దమ్మాలపాటి బుజ్జి, గంటా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలి, ఇందూరి వెంకటరెడ్డి, మహంకాళిరావు, జయరావు, బి.రాజు కోరారు.
» ఏలూరు జిల్లా దెందులూరులోని లైబ్రరీ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతుల్ని విరగ్గొట్టారు. ఈ విధ్వంసంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
» కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామ వీఆర్వో తిరుపాల్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని తిమ్మందొడ్డి గ్రామ ఎస్సీ కాలనీలో వీఆర్వో తిరుపాల్ తన కుటుంబంతో నివాసముంటున్నారు. అదే గ్రామంలో బీసీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వీఆర్వో కుటుంబసభ్యుల్ని కులం పేరుతో దూషించి, కించపరిచారు.
ఈ విషయం తెలుసుకున్న తిరుపాల్ భార్య దేవమ్మ తిట్టిన వారిని ప్రశి్నంచడంతో ‘ఎస్సీ కులానికి చెందినదానవు, నీవు మా ఇళ్ల దగ్గరకు వస్తావా..’ అంటూ మరోసారి దూషించారు. అంతటితో ఆగకుండా ఇంటిమీదకు వెళ్లి తిరుపాల్, దేవమ్మ దంపతులపైన, వారి కుమారుడు జానుపైన దాడిచేశారు. తమపై టీడీపీకి చెందిన పెద్దశేషన్న కుమారుడు హరి, ముత్యాలు కుమారులు వెంకన్న, గిడ్డయ్య, గౌరన్న కుమారుడు హరి దాడిచేసినట్లు వీఆర్వో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనకు, తన కుటుంబానికి రక్షణ కలి్పంచి, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో కోరారు. ఈ విషయమై ఎస్.ఐ. తిమ్మరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం వచి్చందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment