
సాక్షి, డోన్(కర్నూల్): ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన రమిజాబీ కేసులో పలు విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు షేక్ రషీద్ అలియాస్ సిద్దు ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు తెలిసింది. పోలీసులు అదివారం ఆ యువకుడిని అరెస్టు చేసి ఘటన ప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. హత్యకు వినియోగించిన పరికరాలను వెలికి తీయించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తమ వస్త్ర దుకాణంలో పనిచేసే రమిజాబీని ప్రేమిస్తున్నానని నమ్మించి రషీద్ గర్భం చేశాడు.
తర్వాత ఆమెను వదిలించుకునేందుకు చంపాలని ప్లాన్ గీశాడు. వారం ముందుగానే ఎర్రగుంట్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో పూడ్చేందుకు గుంత తవ్వి పెట్టాడు. తర్వాత గడ్డపార, చలిక చెట్ల మధ్యన ఓ గుంతలో దాచిపెట్టాడు. తర్వాత ప్రణాళికలో భాగంగా నంద్యాల పట్టణంలో కాపురం పెడదామని నమ్మించి గత నెల 20న డోన్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో ఎర్రగుంట్ల వద్ద దిగారు. కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్తామంటూ ముందుగానే ఏర్పాటు చేసుకున్న గోతి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రమిజాబీని చున్నీతో గొంతు బిగించి చంపేసి అందులో పూడ్చిపెట్టాడు.
గుర్తుపట్టకుండా ఉండేందుకే...
ఆమె ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు చంపేసి కాల్చివేసినట్లు పోలీసుల ఎదుట రషీదు అంగీకరించాడు. రమిజాబీ 8నెలల గర్భిణి కావడంతో భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమె గర్భంలో ఆడ మృతశిశువు ఉన్నట్లు పోస్టుమార్టంలో బయటపడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment