
కొడుకుతో కలిసి భర్తపై దాడి చేసిన భార్య
కర్నూలు : కర్నూలు జిల్లా డోన్ తారక రామనగర్లో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తపై దాడి చేసిందో భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నివాసం ఉంటున్న కాశింను సోమవారం తెల్లవారుజామున అతని భార్య, కుమారుడు వేట కొడవలితో దాడి చేశారు.
కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాశిం భార్య మగ్భూల్ బీ, కుమారుడు మహబూబ్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మద్యం సేవించి రోజు వేధిస్తున్నాడని, వాటిని భరించలేకే దాడి చేసినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.