
ఆర్‌ఎస్ రంగాపురంలో గ్రామస్తులతో మాట్లాడుతున్న డోన్ డీఎస్పీ ఖాదర్ బాషా
డోన్ రూరల్ : గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఖాదబాషా అన్నారు. మండల పరిధిలోని కోట్లవారిపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మట్కా, పేకాట, మద్యం వంటి వాటికి గ్రామ ప్రజలు దూరంగా ఉండాలన్నారు. గొడవలు సృష్టిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పారు. గ్రామాలల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హోటల్, దుకాణాల వారు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ.మధుసుధన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.